గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ.. శుక్రవారం ఉదయం స్వర్గస్తులయ్యారు. ముఖ్యంగా ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. దాంతో ఫిలింనగర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కైకాల కు సంబంధించిన ఆస్తుల గురించి వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి కైకాల సత్యనారాయణ 60 సంవత్సరాల సినీ జీవిత కాలంలో ఎంత డబ్బు సంపాదించారు అనేది ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

దివంగత నటుడు ఎన్టీఆర్ తో సమానంగా సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్న కైకాల సత్యనారాయణ విలనిజంతో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా యముడు పాత్ర అంటే అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు కైకాల. అందరి హీరోల సరసన విలన్ గా చేసి నటసార్వభౌముడిగా కీర్తి గడించారు. దాదాపు 776 సినిమాలలో నటించి రికార్డు నెలకొల్పిన కైకాల సత్యనారాయణ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

peroperties of kaikala satyanarayana..

కైకాల కు హైదరాబాద్, చెన్నై లలో రెండు ఇళ్ళు ఉన్నాయి. రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి .ముఖ్యంగా వాటిల్లో ఒకటి మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ సి క్లాస్ కాగా.. మరొకటి ఇన్నోవా క్రిష్టా.. ఈ రెండింటి ధర అక్షరాల రూ.96 లక్షలు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో నాగార్జున రెసిడెన్సి లో 1 .47 కోట్ల విలువైన ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం.

peroperties of kaikala satyanarayana..

మొత్తంగా కైకాలకు 40 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కైకాలకు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన వైద్య ఖర్చులకు సహాయం అందించిన విషయం తెలిసిందే. అయితే ఇంతకు మించి కైకాల తన సినీ జీవితం లో పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని తెలుస్తోంది.