అందంతో ఇంటర్నెట్ ని షేక్ చేసిన కూరగాయలమ్మి…హీరోయిన్ అవ్వడం పక్కా..!

అందంతో ఇంటర్నెట్ ని షేక్ చేసిన కూరగాయలమ్మి…హీరోయిన్ అవ్వడం పక్కా..!

by Mohana Priya

Ads

కొంతమందికి పేరు, గుర్తింపు కావాలి అని ఉంటుంది. దానికోసం వాళ్ళు చాలా కష్టపడతారు. తర్వాత ఒక టైంలో వాళ్లు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. అయితే ఇంకొంతమంది మాత్రం అనుకోకుండా స్పాట్ లైట్ వెలుగులోకి వెళ్తారు. సడన్ గా ఫేమస్ అయిపోతారు. వివరాల్లోకి వెళితే. కొంతకాలం క్రితం నేపాల్ లో ఒక అమ్మాయి కూరగాయల బుట్ట పట్టుకొని బ్రిడ్జ్ మీద వెళ్తున్న ఒక ఫోటో , అదే అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్న మరొక ఫోటో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

Video Advertisement

pictures of a girl carrying vegetables went viral

తర్వాత ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. నెటిజన్లు “ఆ అమ్మాయి ఎవరు?” అని సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు కుసుమ్ శ్రేష్ట. బిబిసి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుసుమ్ మాట్లాడుతూ తనకి సెలవులు కావడంతో తన తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఆ రోజు తను మార్కెట్ కి కూరగాయలు తీసుకొని వెళ్లిందని, అప్పుడే ఈ ఫోటో తీశారు అని చెప్పారు.

pictures of a girl carrying vegetables went viral

pictures of a girl carrying vegetables went viral

ప్రముఖ ఫోటోగ్రాఫర్ రూప్ చంద్ర మహర్జన్ కుసుమ్ ఫోటో తీశారు. కుసుమ్ మాట్లాడుతూ ” ఆ వైరల్ అయిన ఫోటోలలో ఉన్న అమ్మాయి నేనేనా అని నా స్నేహితురాలు నన్ను అడిగింది. కానీ నాకు అప్పటివరకు తెలియదు. తను నాకు  అప్పుడు ఫోటోలను పంపింది. అప్పుడు అర్థమైంది ఆ ఫోటోలు నావే అని.

pictures of a girl carrying vegetables went viral

నేను నా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి కూరగాయలు అమ్మడానికి వచ్చాను. ఆ ఫోటోలు నేను దారిలో ఉన్నప్పుడు తీసినవి. కానీ ఆ టైంలో నన్ను ఫోటో తీసిన విషయం నాకు అర్థం కాలేదు” అని అన్నారు. ఇంటర్వ్యూలో, “ఒకవేళ మోడలింగ్ అవకాశాలు వస్తే వెళ్తారా?” అని అడగగా, “వెళ్తాను” అని చెప్పారు కుసుమ్.

pictures of a girl carrying vegetables went viral

కుసుమ్ తండ్రి మాట్లాడుతూ “తను నాకు ఒక్కతే కూతురు నేను తనని ఎంత వీలైతే అంత చదివించాలని అనుకుంటున్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితి గురించి కూడా నేను ఆలోచించాలి. తనకి నర్సింగ్ అంటే ఇష్టం ఉన్నా కూడా నర్సింగ్ కాలేజీలో చేర్పించలేకపోయాను” అని అన్నారు. కుసుమ్ ఫోటోలు వైరల్ అవ్వడంపై ఆయన మాట్లాడుతూ ఆ ఫోటోలపై జనాలకి ఉన్న ఆసక్తి, వారికి రైతులు అంటే ఎంత గౌరవమో అనే విషయాన్ని తెలుపుతుంది అని అన్నారు.

pictures of a girl carrying vegetables went viral


End of Article

You may also like