Podupu Kathalu in Telugu : Telugu Riddles (తెలుగు పొడుపు కథలు) in Telugu With Answers

Podupu Kathalu in Telugu : Telugu Riddles (తెలుగు పొడుపు కథలు) in Telugu With Answers

by Anudeep

Ads

Podupu Kathalu in Telugu: Telugu Riddles (తెలుగు పొడుపు ) in Telugu With Answers :  పూర్వకాలంలో ఖాళీగా ఉన్న సమయంలో పొడుపు కథలు (Podupu Kathalu)ఎవరైనా అడిగేవాళ్ళు. దానికి సమాధానం చెబుతూ ఉంటే కాలక్షేపం కూడా అయ్యేది. కాలక్షేపం కోసం అడిగే చిన్న చిక్కు ప్రశ్నలని పొడుపు కథలు అని పిలుస్తారు.

Video Advertisement

telugu podupu kathalu

telugu podupu kathalu

What is the meaning of Podupu Kathalu in Telugu?
కాలక్షేపం కోసం అడిగే చిన్న చిక్కు ప్రశ్నలను పొడుపు కథలు అంటారు.

Telugu Riddles (తెలుగు పొడుపు కథలు) in Telugu

చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మొసేదొకరు మరియు చూసేదొకరు … ఏంటది ?

సమాధానం :  కళ్ళజోడు

ఆటకత్తే ఎప్పుడు లోనే నాట్యం చేస్తూ ఉంటుంది.. ఏంటది ?

సమాధానం :  నాలుక

ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు … ఏంటది ?

సమాధానం :  వేరుశనగ కాయ

ఎర్రటి పండు మీద ఈగ అయిన వాలదు…ఏంటది ?

సమాధానం :  నిప్పు

తడిస్తే గుప్పెడు మరియు ఏండితే బుట్టెడు… ఏంటది..?

సమాధానం :  దూది

రసం కాని రసం, ఏమి రసం?
సమాధానం :  నీరసం

చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? 
సమాధానం
 :   ఉల్లిపాయ

జాన కాని జాన, ఏమి జాన?
సమాధానం :  ఖజాన

తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది?
సమాధానం :  వేరుశెనగ కాయ

లాగి విడిస్తేనే బ్రతుకు?

సమాధానం : ఊపిరి

అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు

సమాధానం : నిచ్చెన

Podupu Kathalu in Telugu with Answers and Pictures

Podupu Kathalu in Telugu With Answers పొడుపు కథలు

నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండు తోనే నేనెవరు

సమాధానం : నెమలి

నామము ఉంది గాని పూజారిని కాదు వాళ్ళ ఉంటుంది కానీ కోతి ని కాను నేను ఎవర్ని
సమాధానం : ఉడుత

దాన్ని అంగట్లో కొంటారు మరియు దాన్ని ముందర పెట్టుకుని ఏడుస్తారు.ఏంటది?

సమాధానం : ఉల్లిపాయ

ఆకారం ఏమో పుష్టి, మరియు నైవేద్యం నష్టి… ఏంటది ?

సమాధానం : పుచ్చకాయ

కంటికి దొరకదు , చేతికి అందదు మరియు ముక్కుకు అందును … ఏంటది ?

సమాధానం :వాసన

Podupu Kathalu in Telugu With Answers పొడుపు కథలు

కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
సమాధానం : సీతాకోక చిలుక

రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన?
సమాధానం : తాటి చెట్టు

మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?
సమాధానం : పాలు, పెరుగు, నెయ్యి

మోదం కాని మోదం?
సమాధానం :  ఆమోదం

Podupu Kathalu in Telugu With Answers పొడుపు కథలు

రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?
సమాధానం : మంగలి

రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?
సమాధానం :
 ఎండ, వాన, చలి

సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది?
సమాధానం :శంఖం

రాణాలనే మించిన రణం, ఏమి రణం?
సమాధానం :మరణం

రంగం కాని రంగం, ఏమి రంగం?
సమాధానం : వీరంగం

మత్తు కాని మత్తు, ఏమి మత్తు?
సమాధానం
 :గమ్మత్తు

మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు?
సమాధానం :తేనె పట్టు

మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?
సమాధానం : లవంగ మొగ్గ

ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
సమాధానం :తేనె పట్టు

మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?
సమాధానం : పాలు, పెరుగు, నెయ్యి

 


End of Article

You may also like