Ads
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినప్పటి నుండి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి తరచుగా ఏదో ఒక వార్త చర్చల్లో నిలుస్తునే ఉంది. రాళ్ల దాడులు, వరుసగా ప్రమాదాలు, వందే భారత్ ట్రైన్ లో నీళ్లు కారడం లాంటి అనేక సంఘటనలు వింటూనే ఉన్నాం.
Video Advertisement
తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. వందేభారత్ ట్రైన్స్ తో రైల్వే డిపార్ట్మెంట్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ రైళ్లు వేగవంతంగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. అది మాత్రమే కాకుండా ప్రయాణికుల కోరిక మేరకు ప్రతి నెలా కొత్త వందే భారత్ రైళ్లను మొదలుపెడుతున్నారు. ఇక ఇప్పటిదాకా మధ్యాహ్న సమయంలో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే రైలు, బస్సు, విమానం వంటి వాటిలో ప్రయాణం చేయాలంటే ఎవరైనా సరే టికెట్ ఉండాల్సిందే. అయితే తాజాగా యూపీకి చెందిన కానిస్టేబుల్ వందే భారత్ రైలులో టికెట్ లేకుండా ప్రయాణించాడు. ఆయన తన పక్క సీట్లో తన లగేజ్ పెట్టుకున్నారు. టీసీ ప్రయాణికులందరి దగ్గర టికెట్ చెక్ చేస్తూ వచ్చారు. కానిస్టేబుల్ ను టికెట్ చూపించమని ఆడడడంతో టికెట్ లేదని, తాను ఎక్కాల్సిన రైలు మిస్ అవడంతో, ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో టికెట్ లేకుండా ఎలా ఎక్కుతారని, అలా అసలు ఎక్కకూడదని టీసీ చెప్పారు. నెక్స్ట్ స్టేషన్‌లో అతన్ని దిగిపోమని సూచించారు. ఈ ఘటనను రైల్లో ఉన్న పాసింజర్లు వీడియో తీసి, నెట్టింట్లోషేర్ చేశారు. ఆవీడియో వైరల్ అవడంతో ఈ విషయం రైల్వే శాఖ వరకూ వెళ్లింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. https://twitter.com/razzbsingh/status/1711266701483159844?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1711266701483159844%7Ctwgr%5E9112c634cf91eb6f719a50387a6ea7f88a8eab96%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fnational%2Fviral-video-up-police-personnel-boarded-vande-bharat-without-ticket-tte-reprimanded-719966.html Also Read: ఐఫోన్ మీద ప్రేమతో ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? డైరెక్ట్ షాప్ కి వెళ్లి..?
End of Article