నాలుగో అంతస్తు నుంచి దూకి 11 ఏళ్ల చిన్నారి మృతి వీడిన మిస్టరీ..! అసలేం జరిగిందంటే.?

నాలుగో అంతస్తు నుంచి దూకి 11 ఏళ్ల చిన్నారి మృతి వీడిన మిస్టరీ..! అసలేం జరిగిందంటే.?

by Anudeep

Ads

ఎల్‌బీ నగర్‌లోని మధురానగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణరెడ్డి, ప్రభావతి దంపతుల ముగ్గురు కుమార్తెలలో వర్షిత (11) అనే రెండవ కూతురు. సత్యనారాయణరెడ్డి రైతు, ప్రభావతి గృహిణి. వర్షిత స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Video Advertisement

వర్షిత మంగళవారం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం 5.30 గంటలకు తమ ఇంటి సమీపంలోని దుకాణానికి వెళుతున్నాను అని తల్లి వద్ద నుంచి కొంత డబ్బు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరింది. వర్షిత దుకాణానికి వెళ్లకుండా ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కడికి వెళ్లాలని అడిగితే, వర్షిత తండ్రిని కలవడానికి ఎల్‌బి నగర్ ఎక్స్ రోడ్స్‌కు వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పింది.

అమ్మాయి నిజం చెబుతుందో లేదో ధృవీకరించడానికి, ఆటో డ్రైవర్ ఆమెను ఆమె తండ్రి ఫోన్ నంబర్ కోసం అడగ్గా, అమ్మాయి అతనికి ర్యాండమ్ నంబర్ చెప్పింది. ఆటో డ్రైవర్ తన సెల్ ఫోన్ నుండి నంబర్‌కు డయల్ చేసినా ఎవరూ కాల్ చేయకపోవడంతో, అతను బాలికను ఎల్‌బి నగర్ ఎక్స్ రోడ్స్ వద్దకు తీసుకెళ్లి బాలిక సూచనల మేరకు నాలుగు అంతస్థుల భవనం దగ్గర దించి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

“అమ్మాయి ఆటో దిగి, ఆమె తండ్రి అక్కడ లేకపోవడంతో, ఆమె తండ్రి బిల్డింగ్‌లో పనిచేస్తున్నారా అని డ్రైవర్ బిల్డింగ్ వాచ్‌మెన్‌ని అడిగాడు లేదు అని చెప్పడంతో మాట్లాడుతుండగానే.. వర్షిత నాలుగవ అంతస్తు పైకి ఎక్కడం, దూకేయడం క్షణాల్లో జరిగిపోయాయి. వెంటనే వారు ఆస్పత్రికి తరలించినా పాప అప్పటికే మరణించింది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి, సాక్షులను విచారిస్తే బాలిక మరణంలో ఇతరల ప్రమేయం లేనట్టు తెలిసింది. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కింద పోలీసులు తెలిపిన వివరాలకు సంబంధించిన వీడియో ఉంది చూడండి.


End of Article

You may also like