అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చిన ప్రజలను వెనక్కి పంపుతున్న పోలీసులు..! కారణం ఏమిటంటే..?

అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చిన ప్రజలను వెనక్కి పంపుతున్న పోలీసులు..! కారణం ఏమిటంటే..?

by kavitha

Ads

భారత్ లోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్నిసీఎం జగన్ ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కర  కార్యక్రమం శుక్రవారం నాడు సాయంత్రం జరిగింది.

Video Advertisement

ఈ కార్యక్రమంలో టూరిజం మినిస్టర్ రోజా, హోం మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజిని, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో  205 అడుగుల ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 18.18 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.404.35 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
ఈరోజు నుండి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. దాంతో ఉదయం నుండే అంబేద్కర్ విగ్రహం సందర్శనకు స్మృతి వనంకు ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పోలీసులు, అధికారులు ప్రజలను అడ్డుకుని, లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. ప్రజలు విశాఖ, అమలాపురం వంటి ప్రాంతాల నుండి వచ్చామని చెప్పినా కూడా అధికారులు రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది.
స్మృతి వనంలోపలికి  ప్రజలను అనుమతించక పోవడానికి, మినీ థియేటర్‌లో ఐప్యాక్ టీం ఆధ్వర్యంలో మంత్రులతో పార్టీ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్మృతివనం దగ్గర రోడ్డు పైన ఆరుగురు మినిస్టర్ల కాన్వాయ్  వెహికిల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతి ప్రకటించి, తీరా అక్కడకు వెళ్ళాక అడ్డుకోవడంతో  ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తిప్పి పంపుతున్నారంటూ అధికారుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఐప్యాక్ టీం, పార్టీ కార్యక్రమ షూటింగ్ కోసం దూరం నుండి వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.

Also Read: అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణలో తక్కువ ఖర్చు… కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారా..? ఎందుకు..?


End of Article

You may also like