అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణలో తక్కువ ఖర్చు… కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారా..? ఎందుకు..?

అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణలో తక్కువ ఖర్చు… కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారా..? ఎందుకు..?

by kavitha

Ads

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని  ఆవిష్కరించ బోతున్నారు. ఈ అంబేద్కర్ విగ్రహామే ప్రపంచంలో కెల్లా అతి ఎత్తయిన విగ్రహామని ఏపీ గవర్నమెంట్ చెబుతోంది.

Video Advertisement

125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాం, 85 అడుగుల ఎత్తు ఉన్న పెడస్టల్ తో కలిపి 210 అడుగులు ఉన్నట్టు తెలుస్తోంది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా పిలుస్తున్న ఈ విగ్రహా  ఆవిష్కరణ నేపథ్యంలో అంబేద్కర్ స్మృతివనంను  తెలుగుదేశం పార్టీ దళిత నేతలు సందర్శించారు. అంబేద్కర్ విగ్రహాం పేరుతో వైసీపీ దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు.  ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు సమయం న్యూస్ కథనం ప్రకారం.. జనవరి 19న విజయవాడ స్వరాజ్ మైదానంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అంబేద్కర్ విగ్రహాంతో పాటు దాదాపు పందొమ్మిది ఎకరాల్లో స్మృతివనాన్ని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ స్మృతి వనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫొటో గ్యాలరీ మరియు అంబేద్కర్ జీవిత విశేషాలను, శిల్పాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో కన్వెన్షన్ హాల్ మరియు ఫుడ్ కోర్టులు ఉంటాయి. అంబేద్కర్ స్మృతివనం ఏపీలో అతిపెద్ద పర్యాటక స్థలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
విగ్రహాం కింది భాగంలో 3 ఫ్లోర్లు కలవు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 4 హాళ్లను నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నిర్మించారు. వీటిలో ఒక సినిమా హాలు, మూడు హాళ్లలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి  ఫ్లోర్‌లో 4 హాళ్లు, రెండవ ఫ్లోర్‌లో 4 హాళ్లు కలవు. అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతివనంకోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసిఆర్ 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గత ఏప్రిల్ లో ఆవిష్కరించారు. అయితే ఆ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంను టిడిపి దళిత నాయకులు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్ల రూపాయలలోపే ఏర్పాటు చేశారు. విజయవాడలో అంతే ఎత్తు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యిందని టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తోంది.  నక్కా ఆనంద్ బాబు “తమ ప్రభుత్వం ఉన్నప్పుడే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటుకోసం  పనులను మొదలుపెట్టామని, 26 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.

Also Read: వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్, పెళ్లి పత్రికలు చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?


End of Article

You may also like