KRISHNAMMA REVIEW : “సత్యదేవ్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

KRISHNAMMA REVIEW : “సత్యదేవ్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : కృష్ణమ్మ
  • నటీనటులు : సత్యదేవ్, అర్చన, కృష్ణ బూరుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల.
  • నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి
  • దర్శకత్వం : వి వి గోపాల కృష్ణ
  • సంగీతం : కాలభైరవ
  • విడుదల తేదీ : మే 10, 2024

krishnamma movie review

స్టోరీ :

భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) చిన్నప్పటినుండి కలిసి పెరుగుతారు. వీళ్లు అనాధలు. పెద్దయ్యాక కోటి, భద్ర తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. శివ మాత్రం ప్రింటింగ్ షాప్ పెట్టుకుంటాడు. శివ మీనా (అతిరా రాజ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మీనా భద్రని రాఖీ కట్టి అన్న ఎలాగా అనుకుంటుంది. అలా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి. ఒకసారి అనుకోకుండా భద్ర, కోటి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు వాళ్ళు ఏం చేశారు? జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు శివ ఏం చేశాడు? మీనా పరిస్థితి ఏం అయ్యింది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఒక మనిషి చేయని నేరానికి శిక్ష అనుభవించడం, ఆ తర్వాత బయటికి వచ్చి విలన్ ఎవరు అనేది తెలుసుకోవడం అనేది మనం చాలా సినిమాల్లో చూస్తూ వచ్చాం. ఇప్పుడు అదే విషయానికి స్నేహితుల కథని, కొన్ని ఎమోషన్స్ ని యాడ్ చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది. సత్యదేవ్ ఒక కొత్త పాత్రలో నటించారు. కానీ ఇది సినిమా ముందుకి నడవడానికి సహాయ పడలేదు. టేకింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొరటాల శివ ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాలభైరవ అందించిన పాటలు కూడా బాగున్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వెళ్లడానికి ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోతుంది అంతే. అందులో ఇంకా కొంచెం ఆసక్తికరమైన సీన్స్ ఉంటే బాగుండేది.

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కథనం బాగుంది. అసలు ఏం జరిగింది అనేది కూడా సెకండ్ హాఫ్ లోనే చూపిస్తారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సత్యదేవ్ చాలా బాగా నటించారు. మీసాల లక్ష్మణ్ కి మరొక మంచి పాత్ర దొరికింది. మరొక హీరోగా నటించిన కృష్ణ తేజ కూడా చాలా బాగా నటించారు. హీరోయిన్స్ అతిరా రాజ్, మరొక హీరోయిన్ ఐశ్వర్య తమకి ఇచ్చిన పాత్రల పరిధి మేరకు నటించారు. పోలీసులుగా నటించిన నందగోపాల్, రఘు కుంచే కూడా బాగా చేశారు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:

  • ల్యాగ్ గా అనిపించే కొన్ని సీన్స్
  • కొన్నిచోట్ల స్లో గా అనిపించే స్క్రీన్ ప్లే

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే, సత్యదేవ్ కోసం సినిమా చూడాలి అనుకుంటే, ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా కృష్ణమ్మ సినిమా నిలుస్తుంది.

watch video : 


End of Article

You may also like