Ads
తమిళ ఇండస్ట్రీలో హీరో అయినా కూడా, తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య. తెలుగులో ఉన్న హీరోలకి సమానంగా సూర్యకి కూడా గుర్తింపు ఉంటుంది. సూర్య సినిమా విడుదలవుతోంది అంటే, ఒక తెలుగు సినిమా విడుదల అయినప్పుడు ఎంత సందడి ఉంటుందో, సూర్య సినిమా విడుదల అయినప్పుడు కూడా అంతే సందడి ఉంటుంది. తెలుగులో అసలు తమిళ హీరోలకి క్రేజ్ రావడం మొదలు అయ్యింది కూడా సూర్యతోనే. అంతకుముందు రజనీకాంత్, కమల్ హాసన్ సంగతి వేరే. వాళ్లని ఎప్పుడూ తెలుగు సినిమా మన నటులు అన్నట్టే అనుకుంటుంది.
Video Advertisement
కానీ సూర్య నటించిన గజిని సినిమా తర్వాత సూర్య తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది హీరోలు కూడా సూర్యలాగానే తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు. కానీ సూర్య అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సూర్య ప్రముఖ నటి జ్యోతికని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలం క్రితం సూర్య కూతురు దియా పదవ తరగతి మార్కు షీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అందులో దియాకి 97% మార్కులు వచ్చాయి. ఇప్పుడు దియా ముంబైలో చదువుకుంటోంది. దియా ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో దియా కి 96% మార్కులు వచ్చినట్టు తెలుస్తోంది.
మార్కుల పరంగా చూస్తే, తమిళ్ లో 96 మార్కులు, ఇంగ్లీష్ లో 97, అకౌంట్స్ లో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించింది. మొత్తంగా చూస్తే 600 మార్కులకి 581 మార్కులు సాధించి 96.83 శాతం ఉత్తీర్ణతతో పాస్ అయ్యింది. సూర్య పిల్లలు లైమ్ లైట్ కి దూరంగానే ఉంటారు. ఒక సందర్భంలో సూర్య తన పిల్లలతో కలిసి బయటికి వచ్చినప్పుడు, అక్కడ ఉన్న కెమెరా వాళ్లు సూర్య పిల్లలని కూడా ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుంటే, సూర్య తన పిల్లలని ఫోటో తీయొద్దు అని చెప్పారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా సూర్య పిల్లలు బయటికి రారు.
End of Article