Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం మొదలు పెట్టిన దగ్గర నుండి అనేక అడ్డంకులతో స్లో అవుతూ వస్తోంది.
Video Advertisement
అయితే గత కొన్ని రోజుల నుండి ఈ మూవీ నుండి మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే మూవీ నుండి తప్పుకోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. గత ఏడాది ప్రకటించిన ఈ చిత్రం షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే త్రివిక్రమ్ మళ్ళీ స్క్రిప్ట్ మార్చేశారని తెలుస్తోంది. మళ్ళీ ఫ్రెష్ స్టొరీతో షూటింగ్ మొదలు పెట్టారట. మొదట అనుకున్న మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే ను ఈ మూవీ నుండి తప్పించేశారు. దీనిపై గత కొన్ని రోజుల నుండి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుండి పూజాహెగ్డే తప్పుకున్నారని ఆ వార్తల సారాంశం.
మహేష్ బాబుతో గతంలో మహర్షి చిత్రంలో పూజాహెగ్డే నటించింది. మరి ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది. దానికి కారణం ఏమిటని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం నుండి పూజా హెగ్డేని తొలగించారని తెలుస్తోంది. పూజాహెగ్డే ప్రవర్తన పై మహేష్ బాబు మరియు గుంటూరు కారం చిత్ర బృందం విసిగిపోయిందని తెలుస్తోంది.
షూటింగ్ కి పూజా అందుబాటులో లేకపోవడం, ఆమె ప్రవర్తన వల్ల గుంటూరు కారం మూవీ యూనిట్ విసిగిపోవడం వల్ల పూజాహెగ్డేను ఈ సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది. ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్.
Also Read: “ప్రభాస్” తో పాటు… “ప్రాజెక్ట్-K” సినిమాలో నటిస్తున్న ఈ 5 నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
End of Article