గొప్ప వ్యక్తిని బాధపెట్టకండి..! “చంద్రబాబు నాయుడు” పై పూనమ్ కౌర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

గొప్ప వ్యక్తిని బాధపెట్టకండి..! “చంద్రబాబు నాయుడు” పై పూనమ్ కౌర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకి రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. గత నాలుగు రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.

Video Advertisement

ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి అంతగా స్పందించడం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ అశ్వనీదత్, నట్టి కుమార్ లాంటివారు స్పందించారు. తాజాగా నటి పూనమ్ కౌర్ చంద్రబాబు అరెస్ట్ పై ట్వీట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కక్షపూరితంగా మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని కామెంట్లు చేశారు. నందమూరి కుంటుంబం కూడా చందబాబు అరెస్ట్ ను ఖండించింది. తాజాగా నటి పూనమ్ కౌర్ చంద్రబాబుకు అనుకూలంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
పూనమ్ కౌర్ “మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుగారు ప్రజల కోసం చాలా సేవ చేశారని, వారి కొరకు అన్నీ త్యాగం చేసిన గొప్ప మనిషి అని, అలాంటి చంద్రబాబు నాయుడిని  73 ఏళ్ల వయస్సులో జైలుకు పంపించడం,  బాధ పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను.” అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
పూనమ్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో  నెటిజన్లు ఈ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండగా, కొందరు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సటైర్స్ వేస్తున్నారు. పూనమ్ కౌర్ ఫ్యాన్స్ మాత్రం వివాదాల్లో ఇరుక్కోవద్దని సలహాలు ఇస్తున్నారు. ఈ ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: “జైలర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా రజినీకాంత్ గారూ..?


End of Article

You may also like