Ads
ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సారి వార్తల్లో నిలిచారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, గుంటూరు కారం సినిమాని కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తీసినట్టు వార్తలు మొదలు అయ్యాయి.
Video Advertisement
ఈ నవలని యద్దనపూడి సులోచనా రాణి గారు రాశారు. అయితే త్రివిక్రమ్ నవల ఆధారంగా సినిమా తీయడం ఇది మొదటి సారి ఏమీ కాదు. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు ఇలాగే పుస్తకాల ఆధారంగా తీశారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా కూడా అదే దారిలో రూపొందించారు అనే వార్తలు వచ్చాయి.
దీనికి సినిమా నిర్మాత అయిన సూర్యదేవర నాగ వంశీ స్పందిస్తూ, “ఏఎంబి లో ప్రీమియర్ షోస్ లో చూద్దాం” అని రిప్లై ఇచ్చారు. ఇది డైరెక్ట్ గా కాకపోయినా కూడా ఈ వార్తకే వంశీ రిప్లై ఇచ్చారు అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం మీద ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు పూనమ్ కౌర్ కూడా మాట్లాడారు. ఈ విషయంపై పూనమ్ మాట్లాడుతూ ఈ విధంగా రాశారు.
“ఆయన ఏమైనా చేయగలడు. చేసి దాని నుండి బయటపడగలడు. అవన్నీ ఎవరికీ కనిపించకుండా చేయగల గొప్పతనం ఆయనకి ఉంది. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ తో ఈయనకి పని ఏముంది అని ఎప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. సాధారణ జనాలు తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళరు. గురూజీ థింగ్స్” అని అర్థం వచ్చేలాగా రాశారు.
పూనమ్ కౌర్ గతంలో ఎన్నో సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. మరొక పక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. సంక్రాంతి పండగకి కానుకగా ఈ సినిమా విడుదల అవుతోంది. కాబట్టి సినిమా బృందం ఒకటి, రెండు రోజుల్లో ట్రైలర్ కూడా విడుదల చేస్తుంది. అంతే కాకుండా కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు ఇస్తారు.
End of Article