Home Filmy Adda ఇదెక్కడి ట్విస్ట్… పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా.? “పూనమ్ పాండే” విషయంలో అసలేమైంది.?

ఇదెక్కడి ట్విస్ట్… పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా.? “పూనమ్ పాండే” విషయంలో అసలేమైంది.?

by Mohana Priya

నటి పూనమ్ పాండే మరణ వార్త అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. మొన్నటి వరకు బయట కనిపించిన పూనమ్ పాండే సడన్ గా చనిపోయారు అంటే ఎవరికి అర్థం కూడా అవ్వలేదు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మేనేజర్ ఈ వార్తని ప్రకటించారు.

అనారోగ్య సమస్యల కారణంగా పూనమ్ పాండే మరణించారు అని అన్నారు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది.

poonam pandey properties value

తనని తాను క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు తన ట్వీట్ లో, “నేను ఇప్పుడే పూనమ్ పాండే కజిన్ కి ఫోన్ చేసి మాట్లాడాను. తను బతికే ఉంది. తన మరణ వార్తను ఎంజాయ్ చేస్తోంది. ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్” అని రాశారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఇంకా చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా పూనమ్ పాండే బతికే ఉన్నారు అని రాస్తున్నారు. పూనమ్ పాండే మరణించారు వార్త బయటకు వచ్చింది తప్ప ఆమె దహన సంస్కారాలు ఎలా అవుతాయి?

poonam pandey news tweet by umair sandhu

ఆమెని చివరిసారిగా చూడటానికి ఎవరైనా సెలబ్రిటీలు వెళ్లారా? అసలు పూనమ్ పాండే మరణించిన సమయంలో ఎక్కడ ఉన్నారు? ఇవేమీ తెలియదు. పూనమ్ పాండే చనిపోయే ముందు తన స్వస్థలంలో ఉన్నారు అని అన్నారు. నిన్నటి నుండి కూడా అసలు ఆమె మరణించారు అనే న్యూస్ కి కొంత మంది ఇది నిజం కాదు అంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు.

poonam pandey properties value

ఇప్పుడు పూనమ్ పాండే, ఒక వీడియో విడుదల చేసి తన మరణ వార్త గురించి తాను అబద్ధం చెప్పాను అని చెప్పారు. ఇది తను అనారోగ్య సమస్య గురించి అవగాహన కల్పించడానికి చేశాను అని చెప్పారు. కానీ ఏదేమైనా సరే, ఈ విషయం కోసం తన గురించి అలాంటి వార్త ఎందుకు ప్రచారం చేశారు అని కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం పూనమ్ పాండే ఈ వీడియోతో పాటు, ఒక కామెంట్ కూడా షేర్ చేశారు. అందులో తాను ఇలా చేయడానికి ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని రాశారు.

watch video :

https://www.instagram.com/hauterrfly/reel/C24C5DCtyRU/

ALSO READ : చాలా మంది తెలుగు హీరోయిన్స్ కంటే ఈ అమ్మాయి బాగా నటిస్తుంది ఏమో..! ఈమె ఎవరంటే..?

You may also like