పెళ్లి ఆగిపోయిందా అనే వార్తకు క్లారిటీ ఇస్తూ పూర్ణ పోస్ట్…ఆ ఒక్క మాటతో చెక్ పెట్టేసిందిగా.?

పెళ్లి ఆగిపోయిందా అనే వార్తకు క్లారిటీ ఇస్తూ పూర్ణ పోస్ట్…ఆ ఒక్క మాటతో చెక్ పెట్టేసిందిగా.?

by Anudeep

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏటా ఎంతో మంది హీరోయిన్స్ ఎంటర్ అయిన అందులో కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో నిలబడగలుగుతున్నారు. క్లాసికల్ డాన్సర్ గా తన కెరీర్ను ప్రారంభించి తరువాత క్రమేపి హీరోయిన్ గా స్థిరపడ్డా టాలీవుడ్ యాక్టర్ పూర్ణ అందులో ఒకరు. పూర్ణ అలియాస్ సామ్నా కాసీం మలయాళీ భామ అయినప్పటికీ తెలుగులో అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

Video Advertisement

‘శ్రీ మహాలక్ష్మీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూర్ణ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును మరియు దాని సీక్వెల్ అయిన అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయింది. అదేవిధంగా ,‘అదుగో’,‘సీమటపాకాయ్’,‘రాజుగారి గది’,
‘మామ మంచు అల్లుడు కంచు’,‘సిల్లీ ఫెలోస్’ లాంటి ఎన్నో చిత్రాలలో ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషించింది.

poorna 2
కొంతకాలం హీరోయిన్ గా బాగా రాణించిన పూర్ణ ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి రోల్స్ చేస్తూ సెటిల్ అయిపోయింది. ‘తలైవి’ మూవీలో శశికళ పాత్ర , బాలకృష్ణ ‘అఖండ’ మూవీ లో ఆఫీసర్ పాత్ర,వెంకటేష్ ‘దృశ్యం 2′ లో రేణుకా పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఫలితంగా తెలుగులోని ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇలా కెరీర్ పరంగా సక్సెస్ అయిన పూర్ణ ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న పూర్ణ.. చాలా కాలంగా బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇప్పటికే వేరే భాషల్లో పలు షోలలో పని చేసిన ఈ అమ్మడు.. తెలుగులో ‘ఢీ’ షోకు జడ్జ్‌గా చేసింది. దాదాపు మూడు సీజన్లుగా ఇందులో కనిపిస్తోన్న ఆమె.. ఆ తర్వాత జబర్ధస్త్, శ్రీదేవి డ్రామ కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి షోలు చేసింది.

ఈ క్రమంలో రీసెంట్గా పూర్ణ అలియాస్ సామ్నా కాసీం కు జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ జరగడం అందరికీ తెలిసిందే. తన పెళ్లి గురించి వైవాహిక జీవితాన్ని గురించి సోషల్ మీడియాలో పూర్ణ పర్సనల్గా చర్చించింది. అయితే త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది అనుకునే టైంలో తాజాగా ఇప్పుడు తన పెళ్లి జరగడం లేదని న్యూస్ నెట్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం కొన్ని పర్సనల్ రీసన్స్ వల్ల మాత్రమే ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది అని కొందరి అభిప్రాయం. అయితే దీనిపై స్పందిస్తూ పూర్ణ ఒక పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ నావాడు’ అనే క్యాప్షన్ తో తనకు కాబోయే భర్త షానిద్ ఆసిఫ్ అలీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసారు. దీంతో ఈ పెళ్లి కాన్సల్ అనే రూమర్స్ కి చెక్ పెట్టారు.


End of Article

You may also like