కరోనాపై యుద్ధంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన ముగ్గురమ్మలు వీరే..! తప్పక తెలుసుకోండి.!

కరోనాపై యుద్ధంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన ముగ్గురమ్మలు వీరే..! తప్పక తెలుసుకోండి.!

by Anudeep

Ads

అగ్రరాజ్యం చైనా  కరోనా కాటునుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మరో అగ్రదేశం అమెరికాలో కరోనా కేసులు ఆరులక్షలు దాటాయి. మృతుల సంఖ్య పాతికవేలు దాటింది .  ఇటలీ, స్పెయిన్,జర్మనీ , ప్రాన్స్, యుకె తదితర దేశాలు కరోనా థాటికి అతలాకుతలం అవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా కొంచెం కంట్రోల్లో ఉంది.అయితే మన దేశంలో కరోనాని కట్టడి చేయడం లో ముఖ్య పాత్ర పోషించింది ముగ్గురు మహిళలు. వారెవరు? ఏం చేశారు? చదవండి.

Video Advertisement

గత రెండు నెలల నుండి కుటుంబాలను కలవకుండా ఆఫీసులోనే నివాసం ఉంటూ, ప్రతి క్షణం దేశాన్ని,దేశ ప్రజలను కరోనా నుండి ఎలా కాపాడాలి అనే ప్రయత్నంలో తలమునకలై పనిచేస్తున్నారు ప్రీతి సుడాన్, నివేదిత గుప్త, రేణు స్వరూప్.

ప్రీతి సుడాన్

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఈ IAS ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ప్రస్తుతం హెల్త్ సెక్రటరిగా పని చేస్తున్న ప్రీతి సుడాన్  కరోనాపై యుద్ధంచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు.

డాక్టర్ నివేదిత గుప్త

డా.నివేదిత గుప్త మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో కృషి చేశారు. అప్పుడు ఆమె కృషిని గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

డాక్టర్ రేణు స్వరూప్

జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసారు రేణు స్వరూప్ .ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తల్లో ఒకరు. నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో ఉండి సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు  ఎన్నో ప్రశంసలు పొందాయి.

వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి,తర్వాత ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా,  ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తు ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేయడమే కాదు, అనేక విభిన్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు లవ్ అగర్వాల్  రూపొందించినవే.

రెండో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన ఈయన , తర్వాత ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా  నియమించబడ్డారు.  కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారించేలా రాపిడ్ టెస్ట్ కిట్స్ ను తయారుచేయించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు..


End of Article

You may also like