Ads
పవన్ కళ్యాణ్ హీరోగా నాలుగేళ్ళ క్రిందట విడుదల అయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గురించి అందరికి తెసిలిందే. బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం చూసింది. అయితే ఈ సినిమా నుంచి తనని అర్ధాంతరంగా తీసేశారని సంచలన కామెంట్స్ చేసారు పోసాని కృష్ణ మురళి. గత రెండు రోజులుగా పవన్ పైన అయన చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అవడమే కాదు.
Video Advertisement
పవన్ ఫాన్స్ కి ఆగ్రహ ఆవేశాలు కూడా తెప్పిస్తున్నాయి. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఏపీ ప్రభత్వం పై చేసిన ఆరోపణలపై బదులుగా పవన్ పై విమర్శనఅస్థ్రాలని సంధిస్తున్న పోసాని ఈ విషయాన్ని చెప్పొకొచ్చారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి నన్ను తొలగించారని, సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఒకసారి రాత్రి షెడ్యూల్ జరిగిందని షూటింగ్స్ నుంచి తాను ఆరుగంటలకే ఇంటికి వెళ్లిపోయేవాడినని అలాంటిది పెద్ద హీరో కదా అని రాత్రి 9 దాకా వేచి చూసినా రాలేదని రాత్రి 10 .30 కి ఇంట్లో భోజనం చేస్తుంటే ఫోన్ చేసి గట్టిగా తిట్టారని
” ఏవండీ ఆలా ఎలా షూటింగ్ నుంచి వెళ్ళిపోతారని” అన్నారని చెప్పారు. దీనితో కోపం వచ్చి మీరు పది గంటలకి వస్తే అంతవరకూ ఆగాలా? నేను కూడా ఆర్టిస్ట్ నే, అంటూ రియాక్ట్ అయ్యానని ఇక మరుక్షణమే ఆయన్ని సినిమా నుంచి తీసేశారని అన్నారు. పవన్ తన మీద కోపం పెంచుకున్నారని, తనకు మాత్రం ఎలాంటి కోపం లేదని అయన అన్నారు. గత ముప్పైఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని తనకి ఎవరు శత్రువులు లేరని అన్నారు. “నేను జగన్ అభిమానిని ఆయన్ని ఎవరు ఏమైనా అంటే మీడియా ముందుకి వచ్చే మాట్లాడుతానని అన్నారు.
End of Article