“ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా..?” అంటూ… “ప్రభాస్” ఫ్యాన్స్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా..?” అంటూ… “ప్రభాస్” ఫ్యాన్స్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న చిత్రం ఆదిపురుష్‌. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఈ చిత్రంలో  నటించడం, ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల  కాలంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన కథలు ఆదరణ పొందుతున్నాయి.

Video Advertisement

ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటించారు. ఆయనకు జంటగా సీతాదేవి పాత్రలో హీరోయిన్ కృతి సనన్‌ నటించింది. ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16న ఈమూవీ రిలీజ్ కానుంది. ఓవర్సీస్‌ క్రిటిక్, సెన్సార్‌ బోర్డ్ సభ్యుడిగా  చెప్పుకునే ఉమైర్‌ సంధు ఆదిపురుష్‌ రివ్యూ ఇస్తూ ట్వీట్‌ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
adipurush-first-review-umair-sandhu‘ఆదిపురుష్’ చిత్రం రీలీజ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడిగా తమ అభిమాన స్టార్ ను వెండితెర పై వీక్షించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచాయి.  డైరెక్టర్ ఓం రౌత్ రామాయణ మహాకావ్యాన్ని కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రామాయణ కథ అందరికి  తెలిసిన స్టోరీనే అయినా ఓం రౌత్ టేకింగ్, గ్రాఫిక్స్ ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, వివాదాలు వచ్చాయి. కొన్ని ఇంకా కొనగుతున్నాయి. వీటి మధ్యే జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తనకు తానే ఓవర్సీస్‌ క్రిటిక్, సెన్సార్‌ బోర్డ్ సభ్యుడిగా  చెప్పుకునే ఉమైర్‌ సంధు ఈ చిత్రం పై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.‘ఆదిపురుష్’ టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్ బ్యాడ్‌లక్ బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుందని ట్వీట్ చేశాడు. ‘పెద్ద స్టార్స్, భారీ బడ్జె్‌, వీఎఫ్‌ఎక్స్ ఉన్న భారీ చిత్రం. కానీ ఈ మూవీలో సోల్ లేదు. నటీనటులందరు వరెస్ట్ పర్ఫార్మెన్స్  ఇచ్చారు. ప్రభాస్‌ మీకు యాక్టింగ్‌ క్లాసులు అవసరం’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ప్రభాస్ కి ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా? ఈ రేంజ్ కి వచ్చారు అంటే అంత స్కిల్ ఉండబట్టే కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ చూడకుండా రివ్యూ ఏంటని అని తిడుతున్నారు.

Also Read: సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది..!..! ఈ సినిమా గురించి తెలుసా..?


End of Article

You may also like