Ads
డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్ ఊహించని విధంగా భారీ నిరాశ మిగిల్చింది. రామాయణాన్ని వక్రంచి తీశారని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంజనేయ స్వామి చేత మాస్ డైలాగ్స్ చెప్పించారని ఈ మూవీ గురించి బాగా నెగటివ్ టాక్ వచ్చింది.
Video Advertisement
అసలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయమని అభిమానులు డిమాండ్ చేశారు అంటే ఈ మూవీ ఏ రేంజ్ లో ప్రజలను నిరాశపరిచిందో అర్ధం అవుతుంది. గ్రాఫిక్స్ కూడా బొమ్మల గ్రాఫిక్స్ చేసినట్టుగా.. రామాయణం కథ మొత్తం మార్చి తీసిన ఈ మూవీ లో ప్రభాస్ రాముడు పాత్రలో నటించారు.
అయితే ఈ సినిమా చూసిన చాలామంది ప్రభాస్ కి రామాయణం అంటే ఏంటో తెలియదా? ఇప్పటివరకు అతను రాముడి నేపథ్యంలో ఒక్క చిత్రాన్ని కూడా చూడలేదా? ఆ డైరెక్టర్ సినిమా అలా తీస్తుంటే ప్రభాస్ ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించారు. అయితే చాలామందికి తెలియని విషయం షూటింగ్ జరిగే సమయంలో ప్రభాస్ ఈ మూవీ ఔట్పుట్ పై తనకు వచ్చిన ఎన్నో డౌట్స్ డైరెక్టర్ తో షేర్ చేసుకున్నారట. రావణాసురుడు గెటప్ దగ్గర నుంచి చాలా విషయాల్లో ప్రభాస్ తన అనుమానాన్ని వ్యక్తం చేశారట.
ఇలా తీస్తే దీన్ని రామాయణం అనరు.. మీరు ఒకసారి పాత ఎన్టీఆర్ రాముడు గా నటించిన చిత్రాలను చూడండి ,మీకు కనీసం రెఫరెన్స్ గా ఉంటుంది.. అని సలహా కూడా ఇచ్చాడట. కానీ ఓం రౌత్ మాత్రం నువ్వు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకు డార్లింగ్.. అన్ని నేను చూసుకుంటాను అని మూవీ ని అలా తీశాడు. విడుదలైన టీజర్ కు నెగటివ్ రివ్యూస్ వచ్చాక ప్రభాస్ ఇచ్చిన సలహా మేరకు కాస్త గ్రాఫిక్స్ ని మార్చి 3Dలో కూడా విడుదల చేశారు. అలా కాకుండా కేవలం ముందు అనుకున్నట్టు ఒక్క 2Dలో మాత్రమే విడుదల చేసి ఉంటే సినిమాకు కనీసం ఈమాత్రం కూడా వసూళ్లు వచ్చేది కాదు.
ALSO READ : మొదటి రెమ్యూనరేషన్ తో “రామ్ చరణ్” ఏం చేశారో తెలుసా..?
End of Article