Ads
సాధారణంగా ఏ పరిశ్రమ అయినా సరే వారసత్వం అనేది చాలా సహజమైన విషయం. వారి కుటుంబంలో ఎవరైనా సరే ఒకచోట తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటే వారి గుర్తింపుని నిలబెట్టాలి అని వారి తర్వాత తరాల వాళ్ళు అదే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి వారి కుటుంబ గుర్తింపును నిలబెట్టడం మాత్రమే కాకుండా వారికంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు.
Video Advertisement
కానీ సినిమా ఇండస్ట్రీ అనేది జనాలకి ఎక్కువగా ఆసక్తి ఉన్న విషయం కాబట్టి అందులో వారసత్వం గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూ ఉంటాయి. అలా కృష్ణంరాజు గారి కుటుంబం నుండి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ స్టార్ అయిన నటుడు ప్రభాస్. మొదటి నుంచి కూడా ప్రభాస్ తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త పడేవారు.

ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా చూసుకుంటూ, ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ ఉండేవారు. మిర్చి వరకు ఒకలాగా ఉన్న ప్రభాస్, బాహుబలి కోసం చాలా కష్టపడి ఒక రాజు ఎలా అయితే ఉంటారో అలాగే ఉండేలా, అసలు బాహుబలి పాత్రలో ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించుకోవడానికి వీలు లేకుండా ఉండే అంత బాగా నటించారు. అయితే కృష్ణంరాజు గారి కుటుంబం నుండి ప్రభాస్ మాత్రమే కాదు, తర్వాత మరొక హీరో కూడా వచ్చారు.

ఆ హీరో కూడా ప్రభాస్ అప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న తర్వాతే అడుగు పెట్టారు. ఆ హీరో పేరు సిద్ధార్థ్ రాజ్‌కుమార్. సిద్ధార్థ్ ప్రభాస్ కి కజిన్ అవుతారు. అంటే ప్రభాస్ తల్లి చెల్లెలి కొడుకు. కెరటం అనే సినిమాతో సిద్ధార్థ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు.

ఒకరకంగా చెప్పాలి అంటే ఇది రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సినిమా. సినిమా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ యువన్, ఆ ఐదుగురు అనే సినిమాల్లో నటించారు. అవి కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేదు. ప్రస్తుతం సిద్ధార్థ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే సంగతి ఎవరికీ తెలియదు.
End of Article
