Ads
బాహుబలి తర్వాత పాన్ ఇండియా చిత్రాలతో సెన్సేషనల్ స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్. అతను నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదలైన ఈ చిత్రం పది రోజులు కూడా గడవకముందే వివాదాలలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగా పడిపోయాయి. కానీ అందరూ అనుకున్నట్టు దీనికి ఎటువంటి నష్టం వాటిల్ల లేదు ఎందుకంటే మొదటి నాలుగైదు రోజులలోనే రాబట్టాల్సిన అమౌంట్ మొత్తం ఈ మూవీ రాబట్టేసింది.
Video Advertisement
రాముడు చరిత్రను అభ్యంతరకరంగా చూపించడం వల్ల ఈ చిత్రాన్ని పలువురు బాయ్ కాట్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ అన్నిటిలోనూ ఇది అతని హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.
సినిమా స్టార్ట్ చేయడానికి ముందు అడ్వాన్స్ రూపంలో ప్రభాస్ 30 కోట్లు తీసుకున్నారట. ఆ తర్వాత చిత్రం పూర్తి అయ్యాక ప్రభాస్‌కు 110 కోట్లు రమ్యునరేషన్ దక్కింది అని తెలుస్తోంది. అంటే ఈ మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ మొత్తం 140 కోట్లు…. ఇది కాక మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బాగున్నట్లయితే అందులో 10% వరకు ప్రభాస్ కి ముట్టేదని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కలెక్షన్స్ భారీగా పతనం అవడంతో ఆ మార్గంలో ప్రభాస్ కి వచ్చే అమౌంట్ రానట్టే.
ఈ మూవీ బాహుబలి రేంజ్ హిట్ అయి ఉంటే మాత్రం అంచనాలకు మించి ప్రభాస్ కు ఈ చిత్రం నుంచి రెమ్యునరేషన్ వచ్చేది అన్నమాట. ఈ విషయాన్ని పక్కన పెడితే మూవీ గురించి నెగటివ్ ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నప్పటికీ ఎక్కడ ప్రభాస్ గురించి ఒక్క నెగిటివ్ టాక్ కూడా లేదు. దీన్ని బట్టి అతనికి ఉన్న పాపులారిటీ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు .
End of Article