మాకు ఆ హీరోయిన్నే కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్… డైరెక్టర్ కి రిక్వెస్ట్…!

మాకు ఆ హీరోయిన్నే కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్… డైరెక్టర్ కి రిక్వెస్ట్…!

by Mounika Singaluri

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Video Advertisement

అయితే ప్రభాస్ తన తదుపరి చిత్రం యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడు ఈ సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఇది ఇలా ఉంటే, తాజాగా విడుదల అయిన సందీప్ రెడ్డి యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల పైబడి కలెక్షన్స్ సాధించి 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ని ఒక డిఫరెంట్ లెవెల్ లో సందీప్ రెడ్డి ప్రజెంట్ చేశాడు. అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని సందీప్ రెడ్డి వంగా ఏ లెవెల్ లో ప్రజెంట్ చేస్తాడా అంటూ ఇప్పటినుండే ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సందీప్ రెడ్డి వంగాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అదేంటంటే స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ సినిమాలో జోయ పాత్రలో నటించిన త్రిప్తి దిమ్రిని తీసుకోవాలని కోరుతున్నారు. యానిమల్ సినిమాతో త్రిప్తి అందరి దృష్టిని ఆకర్షించింది. అందరికీ డ్రీమ్ గర్ల్ అయిపోయింది. తన అందం అభినయంతో బాగా దగ్గరయింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమకి ఆ హీరొయిన్ కావాలని కోరుతున్నారు. ఈ ఫ్యాన్స్ రిక్వెస్ట్ పైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


End of Article

You may also like