Ads
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
Video Advertisement
అయితే ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ గురించి ఎన్నో సార్లు గొప్పగా చెప్పారు. అలాగే ఇతర భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ అని ఎన్నో సార్లు చెప్పారు.
బాహుబలి తర్వాత దాదాపు రెండు సంవత్సరాల విరామం తీసుకున్న ప్రభాస్ సాహో సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని అలరించారు. సాహో సినిమా తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా రూపొందింది. హిందీ పాత్రకి కూడా ప్రభాస్ స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
అయితే కేవలం సాహో మాత్రమే కాకుండా ఇప్పుడు రాబోతున్న రాధే శ్యామ్, అలాగే అది పురుష్, ఇంకా ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా హిందీలో రూపొందుతాయి. అవన్నీ ప్యాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతాయి. అయితే మనలో చా లామంది ప్రభాస్ డైరెక్ట్ మొదటి హిందీ సినిమా సాహో అనుకుంటాం. కానీ కాదు. ప్రభాస్ అంతకుముందే మరొక హిందీ సినిమాలో నటించారు. కానీ అది అతిధి పాత్రలో.
ప్రభాస్, అజయ్ దేవగన్ హీరోగా నటించిన యాక్షన్ జాక్సన్ సినిమాలో ఒక పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి కనిపిస్తారు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ప్రభాస్, ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి సినిమాలో నటించారు. ఆ స్నేహంతోనే యాక్షన్ జాక్సన్ సినిమాలో ఒక పాటలో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు ప్రభాస్. ఇదే పాటలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపిస్తారు. అలా ప్రభాస్ 2014 లోనే బాలీవుడ్ లో నటించారు అన్నమాట.
watch video :
End of Article