Home Filmy Adda ఏంటి..? ప్రాజెక్ట్-K సినిమాలో “ప్రభాస్” తో పాటు ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారా..? మహేష్ బాబు కూడా..?

ఏంటి..? ప్రాజెక్ట్-K సినిమాలో “ప్రభాస్” తో పాటు ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారా..? మహేష్ బాబు కూడా..?

by Anudeep

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్రాజెక్ట్-కే. వైజయంతి మూవీస్ యాభైయ్యవ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు దీపికా పాడుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని నటిస్తున్నారు. సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.

see how many super heros in Prabhas project-K
వికీపీడియా లో ఈ చిత్ర తారాగణం గురించి వెతుకుతుంటే ప్రభాస్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, తమిళ హీరో సూర్య కూడా ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇంత మంది స్టార్ హీరోలు ప్రాజెక్ట్ కే లో ఉన్నారా అని నెట్టింట్లో చర్చ మొదలైంది. తీరా చూస్తే ఇది అధికారిక ప్రకటన కాదు కాబట్టి వికీపీడియాలో తప్పుగా ఇచ్చి ఉంటారని మాట్లాడుకుంటున్నారు.

salaar movie prabhas entry scene dialogue leaked

ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే విలువ 500 కోట్లని తెలుస్తోంది. 2021 జులై లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ చిత్తానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఈ చిత్రాన్ని 2023 అక్టోబర్ లేదా 2024 జనవరిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంతో దీపికా పదుకొనే టాలీవుడ్లో అడుగుపెట్టనున్నారు. మరోవైపు బాలీవడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ డి ఈ చిత్రంలో కీలక పాత్ర అని దర్శకుడు నాగ్ అశ్విన్ గతం లో తెలిపారు. కాగా నాగ్ అశ్విన్ గతంలో వైజయంతి మూవీస్ తో మహానటి చిత్రాన్ని చేయగా అది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

You may also like