“ప్రభాస్ శ్రీను” ఆ హీరోకి డూప్ గా నటించారా..? ఏ సినిమాలో అంటే..?

“ప్రభాస్ శ్రీను” ఆ హీరోకి డూప్ గా నటించారా..? ఏ సినిమాలో అంటే..?

by kavitha

Ads

తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ మూవీ ఒకటి. ఈ చిత్రం అప్పట్లో భారీ కలెక్షన్స్ రాబట్టి, చిత్ర నిర్మాతలకు లాభాలను ఇచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.

Video Advertisement

రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి ముఖ్యపాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో కొన్ని నిమిషాల పాటు నటించారు. అయితే చిరంజీవి నటించిన సీన్ లో చిరంజీవికి డూప్ గా ప్రముఖ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను నటించారు. ఈ విషయాన్ని ఆయనే రీసెంట్ గా చెప్పడంతో ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్ శ్రీను ఈ విషయం గురించి చెప్పారు. తాను మగధీర చిత్రంలో  చిరంజీవికి డూప్ గా నటించానని వెల్లడించారు. అప్పట్లో హీరో ప్రభాస్ గారి ఇంట్లో రాత్రి 3 వరకు వాలీబాల్ ఆడుతుండేవాళ్ళమని అన్నారు. ఆ టైమ్ లోనే డైరెక్టర్ రాజమౌళి కాల్ చేసి మగధీర మూవీలో అవకాశం ఇచ్చారని తెలిపాడు.చిరంజీవి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కొన్ని షాట్స్ ను తనపై తీశారని చెప్పాడు. ఆ చిత్రంలో మెగాస్టార్ వేసుకున్న డ్రెస్, నా డ్రెస్ ఒకటేనని, చిరంజీవి గారు సెట్ లోకి వస్తుంటే తాను పారిపోయేవాడినని వెల్లడించారు. ఆ డ్రెస్ ను దాచుకోవాలని అనుకున్నానని తెలిపారు. అయితే ఆ డ్రెస్ మళ్ళీ దొరకలేదని వెల్లడించారు.
ప్రభాస్ శ్రీను చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో చర్చకు దారి తీసాయి. ప్రభాస్ శ్రీను చిరంజీవికి డూప్ గా నటించారని తెలిసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ప్రభాస్ శ్రీను టాలీవుడ్ లో కమెడియన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభాస్ శ్రీను పారితోషికం భారీగా తీసుకుంటాడని తెలుస్తోంది.

Also Read: ఆనంద్ సినిమాలో “రాహుల్” పాత్రలో నటించిన యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? అతను ఎవరంటే..?

 


End of Article

You may also like