ఉన్నదంతా దానం చేస్తే ఎలా? అని అడిగితే.. ప్రకాష్ రాజ్ ఇచ్చిన సమాధానం హైలైట్.!

ఉన్నదంతా దానం చేస్తే ఎలా? అని అడిగితే.. ప్రకాష్ రాజ్ ఇచ్చిన సమాధానం హైలైట్.!

by Anudeep

Ads

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పంథానే వేరు.. నటనలో అయినా, నిజజీవితంలో అయినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. సామాజికాంశాలపై స్పందించే నటులలో ప్రకాశ్ రాజ్ పేరు మొదట ఉంటుంది.. అదే విధంగా లాక్ డౌన్ వేళ ప్రజలకు సాయం చేయడంలో కూడా ప్రకాశ్ రాజ్ తనదైన ముద్రతో సాగిపోతున్నారు..ప్రకాశ్ రాజ్ చేసే సాయం ఏ విధంగా ఉంటుందంటే కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్నట్టు.

Video Advertisement

ప్రకాశ్ రాజ్ చేసే ఏ సాయాన్నైనా కూడా సంధర్బం వచ్చి, ఎవరైనా బయటపెడితే తప్ప తనంతట తానుగా బయటికి చెప్పుకోరు. లాక్ డౌన్ వేళ 30మంది వలస కార్మికులకు తన ఫాం హౌజ్లో ఆశ్రయం ఇచ్చి వారికి కావలసిన భోజన వసతి సౌకర్యాలు చూస్తున్నారు. అదేవిధంగా తను దత్తత తీసుకున్న కొండారెడ్డి పల్లి గ్రామస్తుల అవసరాలు తీరుస్తున్నారు.ఉన్న డబ్బు అంతా ఖర్చు పెడితే మీ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక న్యూస్ ఛానెల్ వారు  అడిగిన ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా??

“నా తల్లి అనాధశ్రమంలో పెరిగింది. నా చిన్నప్పుడు తను నర్సుగా పనిచేసేది..వచ్చేది 2000జీతం, ఎవరైనా సాయం అడగితే, తన దగ్గర డబ్బులు లేకపోతే చెవులకు ఉన్న బంగారం ఇచ్చేది. అంతా ఇచ్చేస్తే మనకెలా అమ్మా అని నేను అడిగితే ‘మనకి ఎవరైనా అప్పు ఇస్తారు, పని చేసుకునే శక్తి ఉంది, మన దగ్గర ఉన్నది ఇస్తే, మనకి వస్తాయి అనేది.నేను ఇప్పుడు ఇస్తూనే ఉన్నాను,నేను పనిచేస్తే నాకు వస్తూనే ఉంటాయి అని సమాధానం ఇచ్చారు.

సినిరంగం  మొదలు కొని , రాజకీయం, వలస కార్మికుల సమస్యలు, మోడీ పాలన, కెసిఆర్ పాలన ఇలా అనేక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనిషనేవాడు కష్టపడకుండా చూడగలగాలి, అప్పుడే మంచి పాలన అందించినట్టు. లాక్ డౌన్ లో కేసిఆర్ పాలన బాగుందని ప్రశంసించారు.సిని పరిశ్రమ కోలుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుండొచ్చు..అప్పటివరకు పరిశ్రమలో కింది స్థాయి వారు ఇబ్బంది పడకుండా చూస్కోవాల్సిన బాధ్యత పెద్ద నటీనటులకు ఉంది అని అన్నారు . పరిశ్రమ పరిస్థితులను బట్టి నటీనటులు వారి వారి రెమ్యునరేషన్ల విషయంలో మార్పులు చేసుకోవాలి..నేను అలాంటి మార్పులకు ఎప్పుడూ సిద్దంగా ఉంటాను అని అన్నారు.


End of Article

You may also like