Ads
రోమ్ నగరం తగలడుతుంటే ఫిడేల్ వాయించాడట నీరో చక్రవర్తి . ఆ విషయాన్ని పేపర్లలో చదవడం తప్ప ప్రత్యక్షంగా చూడని వారికి ఆ లోటు తీర్చేస్తున్నారు టిక్ టాక్ ప్రేమికులు . ప్రపంచం మొత్తం కరోనా కలవరంతో కొట్టుమిట్టాడుతుంటే ఈ టిక్ టాక్ చేసుకునే వాళ్లకి మాత్రం అవేం పట్టట్లేదు. నేరుగా రోడ్ల మీదకి వచ్చి టిక్ టాక్లు చేస్తున్నారు.
Video Advertisement
లాక్ డౌన్ అనేది అసలు ఎందుకు పెట్టారు , మన కోసం ఎవరు, ఎలా శ్రమిస్తున్నరు ఇవేవీ వీళ్లకి తెలియదా, తెలిసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారా? అసలు టిక్ టాక్ పైన వచ్చినన్ని విమర్శలు ఏ సోషల్ యాప్ మీద వచ్చి ఉండవు . అయినా కూడా మమ్మల్ని కాదులే అని దులిపేసుకుని పోయే రకంలా ఉంటారు కొందరు. అచ్చం అలాగే ఇద్దరమ్మాయిలు టిక్ టాక్ చేయడానికి రోడ్డెక్కారు , మన పోలీస్ అంకుల్స్ ఊరుకుంటారా? పాపం అమ్మాయిలు అని కూడా చూడకుండా తిట్టి పంపించారు .
మరో చోట రోడ్డంతా ఖాళీగా ఉందని ఒకడు డ్యాన్స్ వేసి మరీ టిక్ టాక్ చేశాడు . పర్లేదు పోలీసులకి వీడియో చేసేప్పుడు దొరక్కపోయుండొచ్చు. సోషల్ మీడియాలో వైరలైంది కదా , ఖచ్చితంగా బడితపూజ చేసే పంపించి ఉంటారు. ఎందుకంటే లాక్ డౌన్ పాటించని వారిని, కరోనా గురించి ఫేక్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే వారిని అస్సలు ఎవరిని వదలట్లేదు పోలీసులు. అందరి లెక్క సెటిల్ చేస్తున్నారు.
కొందరి టిక్ టాక్లు చూస్తే అబ్బా వీళ్ల టాలెంట్ చూపించుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫాం లా ఉపయోగపడుతోంది అనిపిస్తుంది, మరికొందరివి చూస్తే అసలేంట్రా వీళ్ల బాధ అనిపిస్తుంది. ఏది ఏమైనా దేనికైనా సమయం సంధర్బం అనేది ఒకటి ఏడుస్తుంది. టిక్ టాక్ అయనా, వాట్సప్ అయినా, ఫేస్ బుక్ అయినా ఏ యాప్ అయినా ఏదో కాలక్షేపానికే .కాని ఏ విషయం అయినా హద్దు మీరితే తిప్పలు తప్పవు .
టిక్ టాక్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.అలాంటిది ఇప్పుడు కరోనా ఇంత మంది ప్రాణాలకే గండంగా ఉన్న పరిస్థితిలో కూడా అవేవి పట్టనట్టు వాళ్ల గొడవ వాళ్లదే, మీకు అంతగా టిక్ టాక్ చేయాలనిపిస్తే, టిక్ టాక్ చేయకుండా ఉండలేకపోతే కరోనా పై అవేర్నెస్ చేసే విధంగా వీడియోస్ పెట్టండి , జనాల్ని ఎడ్యుకేట్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పండి, హ్యాండ్ వాష్ ప్రాధాన్యత వివరించండి. అంతేకాని పిచ్చి పిచ్చి టిక్ టాక్లు చేయడానికి రోడ్లెక్కకండి.
watch video:
End of Article