కరోనా అంటే అంత కామెడీ గా ఉందా నాగబాబు గారు ? ప్రాణాలు పోతుంటే పంచ్ లు అవసరమా?

కరోనా అంటే అంత కామెడీ గా ఉందా నాగబాబు గారు ? ప్రాణాలు పోతుంటే పంచ్ లు అవసరమా?

by Anudeep

జబర్దస్త్ లో ప్రతి సారి నాగబాబు , రోజా పగలబడి నవ్వుతుంటారు . కొన్ని సంధర్బాల్లో  అసలు అక్కడ జోకేంటో అర్దం కాక మనం తలలు పట్టుకుంటుంటాం. వాళ్లు మాత్రం హాహాహా అంటూ బ్యాక్ డ్రాప్లో వచ్చే సౌండ్ కి తగ్గట్టు పెద్దగా నవ్వేస్తుండేవారు. జబర్దస్త్ నుండి అదిరింది షో కి వచ్చాక కూడా అదే రిపీట్ చేస్తున్నారు నాగబాబు. కాని ఈ సారి ప్రేక్షకుల,నెటిజన్ల కోపానికి గురి కాక తప్పలేదు.

Video Advertisement

అందుకే నవ్వాల్సిన చోట నవ్వాలి ఏడవాల్సిన చోట ఏడవాలి. ఏడ్చే దగ్గర నవ్వితే నవ్వుల పాలు కాక తప్పదు. ప్రస్తుతం నాగబాబు పరిస్థితి అదే . ఒకప్పుడు జబర్దస్త్లో అలా పగలబడి నవ్వుతుంటేనే, వాళ్ల నవ్వులపైనే ఎన్నో జోకులేసుకునేవాళ్లు, ట్రోల్స్ వచ్చేవి.ఇప్పుడు తానే మరో ఛానెల్ కి వచ్చి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. కనీసం అదైన కామెడీని కామేడిలా చూపించకపోతే ఎలా?

జబర్దస్త్ కి పోటీగా స్టార్ట్ అయిన అదిరింది షో కూడా జబర్దస్త్ పంథాలో పోతూ  , డక్కా మొక్కీలు తింటుంది. అయినప్పటికి షోకి ప్రేక్షకులు కనీసం పాస్ మార్కులు కూడా వేయట్లేదు. ఈ క్రమంలో షోలో ఎన్నో మార్పులు చేశారు. స్కిన్ షో చేయనన్న సమీరను తప్పించి , భానుశ్రిని తీసుకున్నారు. రశ్మి, అనసూయలకి ఏ మాత్రం తగ్గకుండా భానుశ్రీ షోలో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది అదిరింది టీం. ఈ ప్రోమో లో వచ్చిన జోక్ కి నాగబాబు నవ్వడం ఇప్పుడు వివాదాంశం అయింది . కరోనా ఎఫెక్ట్ కి ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. రోజురోజుకి మరణాల సంఖ్య పెరుగుతుంది. మనదేశంలో కూడ ఇప్పటికి వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు. ఇదిలా ఉంటే అదిరిందిలో సద్దాం టీం కరోనా పైన స్కిట్ ప్రదర్శించారు.

చైనా నుండి హైదరాబాద్ కి కరోనా వచ్చిందట, మన ఊరికి వస్తే అందరూ పడి చస్తారు అని సద్దాం అనగా, అవతల వ్యక్తి అంత పెద్ద ఫిగరా అది అని అంటే,  కరీనా కాదు కరోనా, కరోనా అంటే చైనాది, కరీనా అంటే బాలీవుడ్ ది అని వచ్చే జోక్ కి నాగబాబు పడి పడి నవ్వడం అనేది ఆ ప్రోమో లో ఉందే. దీనికి నాగబాబు నవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

కేవలం ఇది మాత్రమే కాదు కరోనాపై నాగబాబు చేసిన ట్వీట్ పట్ల కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. కరోనా ని కావాలనే కొన్ని మతాల వాళ్లు, వాళ్ల దేవుడే ఈ కరోనాని, భూమ్మీదకి పంపించారు. ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమీ అని నాగబాబు చేసిన కామెంట్స్ ని కూడా చాలా విమర్శిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ కి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. ఈ సమయంలో ఎంత సంయమనంతో ఉండాలి. అది వదిలేసి ఈ నెగటివ్ కామెంట్స్ , సీరియస్ ఇష్యూపై జోక్స్ వేయడం ఎంత వరకు సమంజసమో కనీసం ఆలోచించండి.


You may also like

Leave a Comment