ఫేస్బుక్ వీడియోలో చూసి అతన్ని ప్రేమించింది…చివరికి అతని వైకల్యాన్ని చూసి?

ఫేస్బుక్ వీడియోలో చూసి అతన్ని ప్రేమించింది…చివరికి అతని వైకల్యాన్ని చూసి?

by Anudeep

Ads

ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది . ఇంట్లో వాళ్లు  ఒప్పుకోలేదు. అతన్నే చేస్కుంటానని పట్టుపట్టింది. చివరికి తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లిచేసుకుంది. ఏముంది విశేషం . ఇవాళ రేపు ఇలాంటి పెళ్లిల్లు చాలనే జరుగుతున్నాయి కదా . కానీ ఈ పెళ్లికి ఒక విశేషం ఉంది. ఆ అమ్మాయి ప్రేమలో ఒక నిజాయితి ఉంది. అందుకో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి దేశంమొత్తం చేత శెభాష్ అనిపించుకుంటుంది. ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకోబోయే వాడు దివ్యాంగుడని తెలీసి ముందడుగు వేయడం మామూలు విషయం కాదు.

Video Advertisement

ప్రణవ్ ది కేరళలోని త్రిసూర్ కి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజేఘాట్ . చదువుకునే రోజుల్లో బైక్ యాక్సిడెంట్ కి గురై, తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. దాంతో పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అన్నింటికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది. అయినప్పటికీ నిరుత్సాహపడని ప్రణవ్ అందరు యువకుల్లానే ఉండాలని అనుకునేవాడు. అందులో భాగంగా అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తుండేవాడు. పండుగల్ని కళ్లారా చూసేవాడు. ఫ్రెండ్స్ తో పాటు తను కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు.  ప్రణవ్ ఫ్రెండ్ అతని వీడియోలు తీసి , సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు.ప్రణవ్ తల్లి తన కొడుకుకి అన్నం తినిపిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేవాళ్లు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

వైరలైన వీడియోస్ ఒకరోజు అనుకోకుండా షహానా అనే అమ్మాయి చూసింది. షహానాది తిరువనంతపురం. ఆ వీడియోస్ లో ప్రణవ్ కాన్పిడెన్స్ షహానాకి ఎంతో నచ్చింది. తన వైకల్యానికి కృంగిపోకుండా అందరిలానే ఉండాలనే ప్రణత్ తత్వం నచ్చింది. ఫ్లైట్ ఎక్కి నేరుగా అతని దగ్గరికి వెళ్లింది. తర్వాత సోషల్ మీడియాలో అతడితో ఇంటరాక్ట్ అయింది. కొన్ని నెలల తర్వాత ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుంది. అతనిని ఫోన్‌ చేసి మాట్లాడింది. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ప్రణవ్‌కు తన ప్రేమ విషయాన్ని చెప్పిన షహానా, పెళ్లి చేసుకుందామంది.

షహానా ప్రపోజల్ కి ప్రణవ్ ఒప్పుకోలేదు. నా లాంటి వాణ్ని చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు. ఇంకెవరినైనా చేసుకో హాయిగా ఉండు అన్నాడు. ప్రణవ్ మాటకి  షహానా ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా లేదంటే ఇలాగే ఉండిపోతా ,నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడిగింది.దానికి సమాధానంగా నువ్వంటే ప్రాణం , కానీ ఏదో చెప్పబోయాడు. అంతే నీ సందేహం నాకు అర్దం అయింది. మా పేరెంట్స్ ని నేను ఒప్పిస్తా అంది.

 

కానీ షహానా పేరెంట్స్ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకోరు. మొదట కోప్పడ్డారు. తర్వాత వద్దు తల్లీ అని బతిమలాడారు. తల్లిదండ్రుల మాటకి షహానా ఒప్పుకోలేదు. నాకు లేని బాధ మీకెందుకు అని తల్లిదండ్రుల్ని ప్రశ్నించింది.పెళ్ళంటూ చేస్కుంటే ప్రణవ్ నే చేస్కుంటానని తెగేసి చెప్పింది.

ప్రేమంటే భౌతిక రూపంతో పనిలేదనీ, మనసులు కలిసేదే నిజమైన ప్రేమ అని చాటిచెప్పింది. ఆమె అంతలా ఇష్టపడుతుండటంతో ఇక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొని ఒక్కటైంది.


End of Article

You may also like