Ads
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారమప్పుడు తళుక్కున మెరిసింది ఒక అమ్మాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆమె మీదే. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో పెరిగిపోయింది. ఎల్బీ స్టేడియం కేంద్రంగా జరిగిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సభలో ప్రియాంక, రాహుల్ గాంధీతో పాటు మరొకరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.
Video Advertisement
రాహుల్ ప్రియాంక సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారంటే అందులో ఒక అర్థం ఉంది కానీ ఈమె ఎవరూ.? ఎప్పుడు చూసినట్టు లేదే అంటూ చాలామంది కామెంట్స్ చేసారు. అలాంటి ఈమె సడన్ గా వేదిక మీద కనిపించేసరికి అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈమె ఎవరంటే… ప్రణితి షిండే.
ఈమె తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉండే మహారాష్ట్రలోని సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే. అంతేకాకుండా ఈమె తండ్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ . కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా,మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయనకి ఉన్న ముగ్గురు ఆడపిల్లలలో ఒకరు ఈ ప్రణితి. సుశీల్ కుమార్ షిండే రాజకీయాలలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ రాజకీయ వారసత్వాన్ని అందుకుంది ఈమె.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలకు ఆహ్వానం పంపించారు. ఈ క్రమంలోనే ఆమె మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రమాణ స్వీకార సభకు హాజరయ్యారు. 2019లో సుశీల్ కుమార్ షిండే సోలాపూర్ లోక్ సభ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి శ్రీ సిద్దేశ్వర మహారాజ్ చేతిలో ఓడిపోయారు. తన తండ్రి పరాజయానికి ప్రణితి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నారు.. అందుకే వచ్చే ఎన్నికలలో సోలాపూర్ లోక్ సభ నుంచి పోటీ చేయబోతున్నారు.
End of Article