Ads
ఇటీవల సోషల్ మీడియా ను అడ్డు పెట్టుకుని చాలా మంది కేటుగాళ్లు అమాయకుల్ని వల వేసుకుని డబ్బు గుంజుతున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ కేటుగాడు మాత్రం ఏకం గా మూడొందలమంది అమ్మాయిలపై కన్నేశాడు. ప్రేమ గా ముగ్గులోకి దింపి.. ఆ తరువాత వారి ఫోటోలను సేకరించి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నాడు. ఇటీవల పోలీసులకు దొరికిపోవడం తో వారు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.
Video Advertisement
ఈ సందర్భం గా అతని మొబైల్ ను చూసి పోలీసులే విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే, కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన ప్రసన్న కుమార్ మొదట ఒక దొంగ. చిన్న చిన్న చైన్ స్నాచింగ్ లు చేయడం.. దొంగతనానికి పాల్పడడం వంటివి చేసేవాడు. ఆ తరువాత పోలీసులకు దొరికిపోయాడు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఈ బుద్ధి మానుకోలేదు. సోషల్ మీడియా లో లవర్ బాయ్ గా చీటింగ్ చేయడం ప్రారంభించాడు.
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ లలో అందమైన ఫోటో ను పెట్టుకుని అమ్మాయిలను అట్ట్రాక్ట్ చేసేవాడు. వారితో ప్రేమ గా చాట్ చేస్తూ.. వల వేసేవాడు. వారితో న్యూడ్ వీడియో కాల్స్ రికార్డు చేయడం, న్యూడ్ ఫొటోస్ సేకరించడం వంటివి చేసేవాడు. అలా చేయని వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి తిరిగి వారికి పంపించేవాడు. ఇలా పంపాక బెదిరింపులకు పాల్పడేవాడు.
అలా దాదాపు 300 ల మంది అమ్మాయిలను మోసం చేసి.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాక్కునే వాడు. ఇటీవల శ్రీనివాస్ అనే ఓ వ్యక్తికీ హైదరాబాద్ సచివాలయం లో జాబ్ ఇప్పిస్తానని మాటిచ్చి.. డబ్బులు తీసుకున్నాడు. గత నెలలో 29 న కూడా ఓ దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులకు దొరికిపోయాడు. దీనితో అతన్ని విచారిస్తున్న సమయం లోనే పోలీసులకు ఈ విస్తుపోయే నిజాలన్నీ తెలిసాయి. అతనివద్ద నుంచి పోలీసులు 1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
End of Article