Ads
కేజిఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాని తరికెక్కించాడు ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ప్రశాంత నీల్ సినిమాలు అన్నీ కూడా డార్క్ దీంతోనే ఉంటాయి. అలా ఉండడంతో కేజిఎఫ్ సినిమాలకి సలార్ సినిమాకి లింకు ఉందేమోనని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే అది ఏం లేదు అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.
Video Advertisement
ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలన్నీ ఎందుకు డార్క్ థీమ్ తో ఉంటాయని ప్రశాంతిని అడగగా ఆయన దానికి వివరణ ఇచ్చారు. తనకి ఓసిడి ఉందని అందువల్ల రంగురంగుల చొక్కాలు, రంగురంగుల ఆబ్జెక్టులు అంటే తనకి నచ్చవని, అన్ని ఒకే విధంగా ఉండేలా చూసుకుంటానని చెప్పుకొచ్చారు.
డార్క్ థీమ్ ఉన్నంత మాత్రాన సలార్ సినిమాకి కేజిఎఫ్ సినిమాకి సంబంధం లేదని కేజిఎఫ్ 2 కంటే ముందే సలార్ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ సలార్ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్ తదితరులు నటించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రన్ని నిర్మిస్తుంది. రవి బస్రూర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుంటుందో చూడా
End of Article