నాకు వచ్చింది “కరోనా” కాదు…ప్రయాణం హీరోయిన్ సంచలన కామెంట్స్..!

నాకు వచ్చింది “కరోనా” కాదు…ప్రయాణం హీరోయిన్ సంచలన కామెంట్స్..!

by Anudeep

Ads

ఒకవైపు ప్రపంచం కరోనా భయంతో వణికిపోతుంటే..మరోవైపు సోషల్ మీడియా ప్రపంచం ఫేక్ న్యూస్ తో వణికి పోతుంది.. దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసే పరిస్థితి నేడు..దాంతో ఎవరికైనా హెల్త్ బాగోలేదనే సమాచారం వస్తే చాలు వెంటనే దాన్ని కరోనా ఖాతాలో వేసేస్తోంది..ఇంకేం ఇబ్బడి ముబ్బడిగా శేరైపోతూ సదరు వ్యక్తికి కొత్త తలనొప్పులు తెస్తుంది..తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు నటి పాయల్ ఘోష్..

Video Advertisement

మంచు మనోజ్‌ “ప్రయాణం”చిత్రంతో టాలివుడ్ కి పరిచయం అయిన ఈ భామ..తర్వాత ఎన్టీఆర్ తో “ఊసరవెల్లి”లో నటించింది.చేసినవి రెండు చిత్రాలే అయినా గుర్తుండిపోయే ఫేసే.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాయల్ ని, హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. దీనితో ఆమెకి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది..తనపై వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టింది పాయల్..

“నేను గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాట వాస్తవమే.. నాకు ముందుగా తలనొప్పి ప్రారంభమై తర్వాత జ్వరం వచ్చింది. దీంతో నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించారు. టెస్టుల్లో మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్‌ త్వరలోనే ముగుస్తుందని బలంగా నమ్ముతున్నా. అతి త్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నమ్ముతున్నాను” అంటూ  వెల్లడించింది.


End of Article

You may also like