Ads
భారతదేశం అంతటా కూడా వేసివి కాలంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి.ఎండ తీవ్రత వలన చాలామంది వడ దెబ్బకు గురవుతుంటారు.అలాగే హృదయ రోగులు ,వృద్దులు ,బీపీ ,డయాబెటిస్ ఉన్నవాళ్లు ముఖ్యంగా ఈ వేసివిలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వైద్యులు చెప్తున్నారు.అయితే ఈ వేసివిలో ఎటువంటి జాగ్రత్తలో తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం …
Video Advertisement
అధిక ఉషోగ్రతలు ఉన్నప్పుడు ఆ ప్రభావం హృద్రోగుల మీద అధికంగా పడుతుంది.రక్త ప్రసారాన్ని చేసే ఆర్టెరీస్ మరియు వెయిన్స్ అధిక వేడి వలన తీవ్ర ఒత్తిడికి గురవుతాయి.సరైన పోషకాలు ఉన్న ఆహారం మరియు తగినంత నీరు తీసుకోవడం వలన ఇటువంటి సమస్యల నుండి హృద్రోగులు బయటపడచ్చు.
ఇప్పటికే హృదయ రోగానికి గురియైన వారు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.ఇలాంటివారు రోజుకు 1 .5 లీటర్ వాటర్ తప్పనిసరిగా తాగాలని చెప్తున్నారు.ఎక్కువగా ఉష్ణం శరీరం మీద పాడడం వలన చెమట ద్వారా బాడీలో ఉండాల్సిన ఫ్లూయిడ్ అంతా నష్టపోతామని దాని ద్వారా గుండె వేగంగా కొట్టుకుంటుంది దాని ఫలితంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కార్డియాలజిస్ట్ లు చెప్తున్నారు.ఇప్పటికే లో బీపీ ,హృదయ రోగాలు ఉన్నవారిలో ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.
శరీరంలో ఉన్న నీరు చెమట ద్వారా బయటకి ఎక్కువగా పోవడం వలన బాడీ లో ఉన్న సోడియం ,పొటాషియం నష్టపోతాయామని తద్వారా తల తిరగడం ,తల నొప్పి ,వికారం ,వాంతులు ,నీరసం లాంటి సమస్యలు వెంటనే తలెత్తుతాయని వైద్యులు చెప్తున్నారు.అందుకే ఈ వేసవి కాలంలో ఎక్కువగా నీరు తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెప్తున్నారు.
వయసు పైబడిన వారిలో సోడియం ,పొటాషియం లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయని అలాంటివారు అధిక ఉష్ణానికి గురిఅయితే వారిలో హృదయ సమస్యలు మరియు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువని జనరల్ మెడిసిన్ వైద్యులు చెప్తున్నారు.అయితే ఇలా అధిక వేడి నుండి కాపాడుకొని ఆరోగ్యంగా ఉండే కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం ..
1 .రోజుకి సరిపోయేంత నీరు తీసుకుని ఎక్కువ పోషకాలు ఉన్న ద్రవ పదార్ధాలు తీసుకోవాలి
2 .రోజు కచ్చితంగా 45 నిముషాలు వ్యాయామం చెయ్యాలి.కాఫీ ,ఆల్కహాల్ తీసుకోకూడదు.
3 . హృదయ రోగాలు ఉన్నవారు ఎక్కువ నీరు తాగాలి ,ఆహారంలో తక్కువ ఉప్పు ను ఉపయోగించాలి.
4 .తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.దానివలన అరుగుదల బాగుండి శరీర అవయవాలు బాగా పనిచేస్తాయి.
5 .వ్యాయామం ఎక్కువ వేడిలో బయట వాతావరణంలో చెయ్యకూడదు.ఉదయం సమయంలో ఇంటి వద్దనే వ్యాయామం చెయ్యాలి.
6 .తేలికైన దుస్తులను మాత్రమే ధరించండి.తెలుపు రంగు దుస్తులను ధరించడం వలన తక్కువగా వేడిగా గురిఅవుతారు.
7 .చల్లటి వాతావరణంలో ఉండండి.ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో ఉండడం కూడా ఈ వేసవి కాలంలో చాలా మంచిది.
8 .ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళకండి.
9 . బయటకు వెళ్ళేటప్పుడు టోపీ ధరించి ,సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళండి.
10 .బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా బీపీ చెక్ చేయించుకోండి.ఏమైనా బీపీ లో తేడాలు గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
End of Article