మీ ఇంటి నుండి మార్కెట్ కి వాళ్ళు మాత్రమే వెళ్లడం మంచిది.! గుర్తుపెట్టుకోవాల్సిన 11 విషయాలివే.!

మీ ఇంటి నుండి మార్కెట్ కి వాళ్ళు మాత్రమే వెళ్లడం మంచిది.! గుర్తుపెట్టుకోవాల్సిన 11 విషయాలివే.!

by Mohana Priya

Ads

దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో లాక్ డౌన్ రూల్స్ సడలించడం తో జనాల మెల్లగా బయటికి రావడం మొదలుపెట్టారు. దుకాణాల్లో వీధుల్లో జనసంచారం ఎక్కువైంది. ఏదేమైనా భారతదేశంలో 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. ఇలాంటి సమయాల్లో ఏదైనా కొనడానికి బయటికి వెళ్లినప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏవైనా వస్తువుల్ని కొంటున్నప్పుడు ఈ రూల్స్ ని కచ్చితంగా పాటించాలి.

Video Advertisement

  • ఎవరికైనా శ్వాస తీసుకునే ఇబ్బందులు ఉంటే వాళ్ళు బయటికి వెళ్లకపోవడమే మంచిది. వారి బదులు ఎవరైనా కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని బయటికి పంపించాలి.
  • బయటికి వెళ్ళిన తర్వాత మీరు కొనే వస్తువులన్నిటిని పెట్టుకోవడానికి ఒక శుభ్రమైన చోటు ని ఎంచుకోండి. అలాగే డిస్పోజల్ బ్యాగ్ కూడా ఉండేలా చూసుకోండి.

  • ఇంట్లోకి కావలసిన సామాగ్రి కోసం మీరు దుకాణాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోకండి. అలాగే అనవసరంగా కళ్ళు నోరు ముక్కు ని ముట్టుకోకండి.
  • క్యూలో నిలబడినప్పుడు మూడు అడుగుల దూరం పాటించండి. వీలైతే షాపింగ్ మొదలుపెట్టే ముందు మీరు వస్తువులు వేసుకుంటున్న ట్రాలీ ని టిష్యూ తో కానీ, బట్టతో కానీ శానిటైజ్ చేయండి.గ్లోవ్స్ వేసుకోవడం కూడా ఒక మంచి ఆప్షనే. కాబట్టి గ్లోవ్స్ వేసుకున్నా పర్వాలేదు.

  • వస్తువులు కొనడానికి బయటికి వెళ్లే ముందే ఏమేం వస్తువులు కావాలి అనేది ఒక లిస్టు తయారు చేసుకోండి.
  • బయటికి వెళ్లినప్పుడు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే వేరే పరిసరాలు ముట్టుకుని మళ్లీ సెల్ ఫోన్ ముట్టుకోవడం వలన వైరస్ సెల్ ఫోన్ కి అంటుకొని వ్యాపించే ప్రమాదం ఉంది.

  • వస్తువులను తీయడం మళ్లీ వెనక్కి పెట్టేయడం లాంటివి చేయకండి. ఏ వస్తువులు అవసరమో అవి మాత్రమే తీసుకోండి.
  • ఇంటికి వెళ్లిన వెంటనే చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. అలాగే మీరు తెచ్చిన వస్తువులన్నిటినీ సర్దేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోండి.

  • కూరగాయలు పండ్లు లాంటి వాటిని శానిటైజ్ చేసిన ప్రదేశాల్లో భద్రపరుచుకోండి. అలాగే ప్యాక్ చేసి ఉన్న వస్తువులు అయితే పైన ప్యాకెట్ ను శానిటైజ్ చేసిన బట్టతో లేదా టవల్ తో తుడవండి.

ఇలా బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇవి పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచిన వాళ్లు అవుతారు.


End of Article

You may also like