సినీ తారాలన్నాక కొంచం బోల్డ్ గానే ఉంటారు. వారికెదురయ్యే పరిస్థితుల్ని బోల్డ్ గానే ఎదుర్కోవాల్సిన అవసరం వారికి ఉంటుంది. అయితే.. మిగతా హీరోయిన్లతో పోలిస్తే సమంత మరింత బోల్డ్ గా ఉంటారు. అందం, టాలెంట్, సాయం చేసే గుణం, ఆత్మస్థైర్యం, ఇలా ప్రతి విషయం లోను సమంత ప్రత్యేకం గానే ఉంటారు. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భం గా ఆమె ప్రత్యేక డిజైనర్ ప్రీతమ్ ఓ పోస్ట్ ను షేర్ చేసారు. దీనితో.. వీరిద్దరి బంధం పైనా ఉన్న రూమర్స్ కి తెర పడింది.

samantha 1

మొన్నామధ్య ఎప్పుడూ సమంత ఓ ఫోటో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తన డిజైనర్ ప్రీతమ్ ఒడిలో కాళ్ళు పెట్టుకుని తాపీ గా కూర్చున్న పిక్ ని అప్ లోడ్ చేసారు. దీనితో.. సమంత ప్రీతమ్ తో ఇంత సన్నిహితం గా ఉంటారా..? అని అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతే కాదు సమంత ను విమర్శించారు కూడా. ఏమనుకున్నారో ఏమో.. సమంత కూడా ఈ పిక్ ను డిలీట్ చేసారు. ఈ ఫోటో చూసి నాగ్ కూడా కోపగించి ఉంటారని.. అందుకే సమంత ఈ పిక్ ను డిలీట్ చేసారని కూడా ప్రచారం చేసారు.

samantha 2

కానీ.. ప్రీతమ్ తో తన సాన్నిహిత్యం లో ఎలాంటి మార్పు లేదని కొన్ని సందర్భాల్లో సమంత వ్యక్తపరుస్తూనే వచ్చారు. తాజాగా.. ప్రీతమ్ షేర్ చేసిన పోస్ట్ చూస్తే ఆ విషయం స్పష్టం అవ్వక మానదు.. ప్రీతమ్ తన పోస్ట్ లో..” నువ్వెప్పుడూ నాకు సపోర్ట్ ఇస్తూనే వచ్చావ్.. నీ బర్త్ డే సందర్భం గా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా.. నీపై నా ప్రేమ ఎప్పుడు అంతం కాదు.. హ్యాపీ బర్త్ డే జిజి” అంటూ పేర్కొన్నాడు. సమంతని జిజి అని సంబోధిస్తూ వారి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చేసాడు.

samantha 2

జీజీ అంటే అక్క అని అర్ధం.. సో, వీరిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని తెలిపేలా ప్రీతమ్ పోస్ట్ చేసారు. ప్రీతమ్ పోస్ట్ కి సమంత కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. సమంత కూడా మనస్పూర్తి గా ప్రేమిస్తున్నా అని చెప్పుకొచ్చారు.

samantha 3