Ads
సాధారణం గా ఏ ప్రోడక్ట్ లేదా కంపెనీ బ్రాండింగ్ గురించి చెప్పుకోవడానికి, వినియోగదారులకు వివరించే ప్రయత్నం చేయడానికి యాడ్ లను రూపొందిస్తుంటారు. యాడ్ లను జనం లో బాగా ప్రాచుర్యం పొందేలా చేయడానికి బాగా క్రియేటివిటీ ని జోడిస్తుంటారు. కొన్ని యాడ్ లు మనలని ఎమోషనల్ గా హత్తుకుని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాడ్ కూడా అలాంటిదే.
Video Advertisement
“ప్రెగా న్యూస్” అనే సంస్థ కోసం ఈ యాడ్ ను రూపొందించారు. ఇన్ ఫెర్టిలిటీ కారణం గా సంతానం కలగని వారికి గుడ్ న్యూస్ చెప్పే ఉద్దేశం తో ఈ సంస్థ పని చేస్తుంది. అయితే, చాలా మంది సంతానం లేకపోవడం వలన బాధ పడుతూ ఉంటారు. కొందరైతే, సంతానం లేకపోతె ఓ స్త్రీ గా తాము పరిపూర్ణత చెందినట్లు కాదని భావిస్తూ ఉంటారు. అయితే, స్త్రీలు ఎన్నో పనుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారని, కేవలం సంతానం లేనంత మాత్రాన పరిపూర్ణత పొందనట్లు కాదని అర్ధం వచ్చేలా ఈ యాడ్ ను రూపొందించారు. ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షలకు పైగా వీక్షకులు ఈ యాడ్ ను వీక్షించారు.
“#SheisCompleteinHerSelf” అనే హాష్ టాగ్ తో ఈ వీడియో నెట్టింట్లో షేర్ అవుతోంది. ప్రకటనలో, లతికా అనే అమ్మాయి ఇంటి పెద్ద కోడలిగా, ఉద్యోగిని గా ఎంతో సమర్ధవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఆమె తోడికోడలు గర్భవతి గా ఉంటుంది.
ఆమె కు సీమంతం చేయడానికి ఇంట్లో సభ్యులంతా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే, ఆమె పైకి సంతోషం గా నే కనపడుతున్నా.. తనకు సంతానం లేదని కొంత బాధపడుతూ ఉంటుంది. బాధను ఓర్చుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ , చక చకా పనులు చక్కబెడుతూ ఉంటుంది.
అయితే పుట్టబోయే పాపకు పేరు పెట్టె విషయమై చర్చలు జరుగుతుంటాయి.. అందరు తలో పేరు చెప్పగా, తోడికోడలు మాత్రం లతికను అడుగుతుంది. తాను ఎదో పని ఉన్నట్లు అక్కడనుంచి వెళ్ళిపోబోగా.. నాకు పాప పుడితే నీ పేరే పెట్టుకుంటా అంటుంది. నీలా తాను కూడా ఉంటుందని అంటుంది. లతికా ఒక్కసారి గా తన ఆనందాన్ని కన్నీళ్ల ద్వారా వ్యక్తపరచడం తో ఈ యాడ్ పూర్తి అవుతుంది. ఈ యాడ్ ఎందరో హృదయాలను కదిలిస్తోంది. మీరూ ఈ కింద వీడియో లింక్ లో చూసేయండి మరి.
watch video:
End of Article