Ads
ఇటీవల కాలం లో ఆత్మహత్యలు ఎక్కువ గా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గర్భవతి అయిన మరో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికం గా విషాదాన్ని నెలకొల్పింది. నిజామాబాద్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తన చావుకు అత్తమ్మే కారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.
Video Advertisement
image credits: news18
ఈటీవీ భారత్ కథనం ప్రకారం… నిజామాబాద్ కు చెందిన యువతీ ఆమె మేనత్త కొడుకునే ప్రేమించింది. రెండు కుటుంబాల సమక్షం లో 2020 జూన్ లోనే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగవ నెల గర్భం తో ఉంది. పెళ్లి అయిన తరువాత ఆ అత్తా కోడళ్ల మధ్య మనస్పర్థలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హఠాత్తుగా మంగళవారం ఆమె మృతి చెందింది.
image credits: etvbharat
కాలుజారిపడడం వలన గర్భస్రావం అయ్యి ఆమె మృతి చెందిందని చెబుతూ అంత్యక్రియలను పూర్తి చేసారు. వారి కుమార్తె మరణించడం తో ఆమె తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. అయితే అత్తింటివారు కూడా రక్త సంబంధీకులే కావడం తో వారు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాలేదు. అయితే.. మృతురాలి ఇంట్లోనే బుధవారం ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది.. “నా చావుకి అత్తమ్మే కారణం.. నువ్వు బాధ పడడం నాకిష్టం లేదు బావ.. మా ఇద్దరి మధ్యలో నువ్వు నలిగిపోవడం నచ్చలేదు.. నన్ను క్షమించండి అమ్మా నాన్నా.. అయామ్ సారీ బావా.. చెల్లి జాగ్రత్త.. మామయ్యా మీ ఆరోగ్యం జాగ్రత్త.. నువ్వు సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నా.. ఇట్లు-నీ పొట్టి..” అన్న సూసైడ్ నోట్ సోషల్ మీడియా లో మాత్రం వైరల్ అవుతోంది. అయితే.. వారినుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
End of Article