అప్పులు తీర్చుకోడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు.! నటి జయలలిత వెనకున్న ఈ రియల్ స్టోరీ తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

అప్పులు తీర్చుకోడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు.! నటి జయలలిత వెనకున్న ఈ రియల్ స్టోరీ తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

by Anudeep

Ads

ఇటీవల జీ తెలుగు లో ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో ఆర్య కు తల్లి గా శారదాదేవి పాత్రలో నటి జయలలిత అదరగొడుతున్నారు. జయలలిత సీరియల్స్ లో కంటే సినిమాల్లో ముందు నటించారు. కమలహాసన్ ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో వాంప్ పాత్ర ను పోషించిన జయలలిత బాగా పాపులర్ అయ్యారు.

Video Advertisement

ఆ తరువాత ఎక్కువ గా అలాంటి పాత్రలు చేస్తూ రావాల్సి వచ్చింది. ఆ తరువాత, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కమెడియన్ రోల్స్ కూడా చేసారు. ఆమె దాదాపు ముప్పై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతూ వస్తున్నారు.

jayalalitha 1

ఈ ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానం లో ఆమె ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొన్నారు. వీటన్నిటి గురించి.. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. తానూ మలయాళం లో కూడా వాంప్ పాత్రలు పోషించినట్లు పేర్కొన్నారు. చివరకు అలాంటి డీగ్రేడ్ సినిమాలు తీసే వినోద్ అనే డైరెక్టర్ నే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. “మేమిద్దరం దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నాం.. ఈ సమయం లో ఆ టైప్ సినిమాలను తీస్తూనే ఉన్నాం.. అతను భక్తి సినిమాలను కూడా తీసేవారు, డీగ్రేడ్ సినిమాలు కూడా తీసేవారు.. డీగ్రేడ్ సినిమాలలో నేను హీరోయిన్ గా ఉండేదాన్ని.. అలా చాలా సినిమాలు చేసాం..”

jayalalitha 2

ఆ టైం లో అనుకోకుండా ఓ ఘటన జరిగింది. క్రాస్ బెల్ట్ మనీ షూటింగ్ వాళ్ళకి, వినోద్ వాళ్లకి ఒకే డేట్ ను షూటింగ్ కోసం ఇచ్చారు. ఆ సమయంలో వాళ్ళ షూటింగ్ కి వెళ్లకుండా వినోద్ షూటింగ్ లోనే పాల్గొన్నాను. ఆ సమయం లో వారు వచ్చి షూటింగ్ జరుగుతున్న చోట గొడవ గొడవ చేసారు. ఆ టైం లో వినోద్ సేవ్ చేసాడు. నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసి.. వాళ్లతో మాట్లాడాడు. ఆ టైం లో హీరో లా కనిపించాడు. దానితో వినోద్ కి బాగా కనెక్ట్ అయిపోయా.. అలా మా మధ్య ప్రేమ మొదలైంది.

jayalalitha 3

” ఏడేళ్ల తరువాత, పెళ్లి చేసుకోవాలంటూ వినోద్ తొందరపెట్టాడు.. అప్పటికి నాకు డౌట్ వస్తూనే ఉంది.. నేను వెళ్తున్న దారి కరెక్టేనా కాదా..? అని.. కానీ వినోద్ తొందరపెట్టడం తో పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ పెళ్ళి ఆరు నెలల కాలం కూడా నిలవలేదు. ఏడాదికే ఇద్దరం విడాకులు తీసుకున్నాం. కేవలం, నా ఆస్తిని చూసే పెళ్లి చేసుకున్నాడని అర్ధమైంది.. తన అప్పులు తీర్చుకోవడానికే నన్ను పెళ్లి చేసుకున్నాడు..” అని జయలలిత చెప్పుకొచ్చింది.

“మా పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోకపోతే… దాచుకున్న డబ్బులు పెట్టి నగలు,చీర కొనుక్కుని పెళ్లి చేసుకున్నా.. కానీ ఈ పెళ్లి ఏడాదికే పెటాకులైంది” అని జయలలిత ఆవేదన వ్యక్తం చేసారు.

jayalalitha 4

ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లోనే దిగ్గజ దర్శకుడు విశ్వనాధ్.. బ్రాహ్మణ అమ్మాయివి అయి ఉండి.. డిగ్రీ చదివి , డాన్సర్ అయి ఉండి సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్…? డాన్స్ షో లు ఇవ్వు.. కాదనుకుంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంటూ సలహా ఇచ్చారట. కానీ.. సినిమాల పై మక్కువతోనే జయలలిత ఇండస్ట్రీ వైపుకు వచ్చారు. ప్రస్తుతం జయలలిత ఎవరిని పెళ్లి చేసుకోకుండానే ఉంటున్నారు. జయలలిత తో పాటు ఆమె మేనమామ కొడుకు భాస్కర్ కూడా తోడుగా ఉన్నారు.

భాస్కర్ జయలలిత కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. ఆమె అకౌంట్లు, డేట్స్, షెడ్యూల్స్ అన్ని భాస్కర్ చూసుకుంటారట. తన జీవిత విషయాలను పంచుకుంటూ జయలలిత ఆడపిల్లలను సినిమా వైపుకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. చక్కగా చదువుకుని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలంటూ సూచన చేస్తున్నారు.

watch video:


End of Article

You may also like