కరోనా మహమ్మారి దేశాన్ని మొత్తం చుట్టేసింది ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది…ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు..వ్యాపారాలు చేసుకోలేక వ్యాపారస్తులు అవస్థలు పడుతున్నారు…మార్చి, ఏప్రిల్ లో జరగవలసిన పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తెలియక విద్యార్థులు తిక మక పడుతున్నారు.ఇక క్రికెట్ అభిమానులు ఐపీల్ వాయిదా పడటం తో తీవ్ర నిరాశకు గురయ్యారు..అలాగే పాపం ప్రేమికులు కూడా ఎక్కడ కలుసుకోలేని పరిస్థితి..వెళదాం అంటే పార్కులు లేవాయె.

మాట్లాడుకుందాం అంటే మాల్స్,థియేటర్స్ లేవాయె..ఇలా ఆగలేకపోయిన ఒక అమర ప్రేమికుడు అర్ధరాత్రి ఏకంగా తన గెటప్ ని మార్చుకొని అమ్మాయి వేషంలో పంజాబీ డ్రెస్ లో మొహానికి చున్నీ ని కప్పుకొని వెళ్ళాడు.ఈ ఘటన గుజ‌రాత్‌లోని వల్సాడ్‌‌లో జరిగింది. రాత్రి పూట తన ప్రేయసిని కలుసుకుందామని బయలుదేరివెళ్లిన ఆ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు రోడ్డు మీద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని చూసి పట్టుకున్నారు పోలీసులు ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించారు ఎంతసేపటికి నోరు మెదపక పోయేసరికి మొహానికి ఉన్న ముసుగుని తొలగించగా ఒక్కసారి యువకున్ని చూసి అవాక్కయ్యారు..యువకుడి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.