యాక్ట్రెస్ ప్రియమణి టివి షోలతో బుల్లితెరను ఏలుతున్నారు. ఇటు నారప్ప సినిమాతో ఇండస్ట్రీ లో కూడా రచ్చ చేస్తున్నారు. ఆమె ఢీ షో కు జడ్జి గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. షో కంటెస్టెంట్స్ లో ఒకరైన కేవల్ ప్రస్తుతం బ్లడ్ కాన్సర్ తో పోరాడుతున్నారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం 12 మంది బ్లడ్ డొనేట్ చేయాల్సిన అవసరం ఉంది.

priyamani

ఈ క్రమం లో ఆయనను కాపాడాలంటూ ప్రియమణి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరో వైపు యాష్ మాస్టర్ కూడా తన అసిస్టెంట్ కేవల్ ను కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కేవల్ ప్రస్తుతం వేలూరు సీఎంసీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. పరిసర ప్రాంతాలలో ఉన్న వారు సాయం అందించాలని కోరుతున్నారు.