సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయం అయిన క్షణాల్లో వైరలవుతోంది. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా వారి పెళ్లి, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
Video Advertisement
సోషల్ మీడియా వాడకం అందరికి అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల వార్తలు ఏవైనా సరే వెంటనే ఫ్యాన్స్ కి చేరుతున్నాయి. సోషల్ మీడియా సెలబ్రిటీలు ఫ్యాన్స్‌కు మధ్య వారధిగా మారింది. తాజాగా ఒక నటి రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మరి ఆ నటి ఎవరో? ఏవరిని పెళ్లి చేసుకుందో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొందరు రహస్యంగా, సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి తరువాత ఆ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా వివాహం చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి ఇక్కడ కాకుండా విదేశాల్లో చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రియాంక నల్కారి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కి సుపరిచితామే. బాలనటిగా కూడా చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్నింటిలో ముఖ్యమైన పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి యాంకర్‌గా చేసింది. అయితే ఆ ప్రోగ్రామ్ అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు యాంకర్ గా గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఆఫర్స్ లేకపోవడంతో ప్రియాంక తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమె నటిస్తోన్న రోజా సీరియల్ తమిళంలో టాప్ రేటింగ్‌తో రన్ అవుతోంది. దాంతో అక్కడ ప్రియాంకకు పాపులారిటీ విపరీతంగా వచ్చింది.
ఈ క్రమంలో మార్చి 23న ప్రియాంక పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి వ్యక్తితో ఆడంబరాలకు పోకుండా ఎంతో సింపుల్‌గా దేవాలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఆమె ఫాలోవర్లు అందరు సడెన్‌గా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటూనే శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రియాంక తన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
Also Read: సొంత అన్నదమ్ములు కాకపోవడం వల్లే మంచు సోదరుల మధ్య గొడవలు అవుతున్నాయా?