మంచు కుటుంబం గొడవ రోడ్డున పడింది. కొంతకాలంగా విబేధాలు ఉన్నట్టు వినిపిస్తున్నా బయటికి రాలేదు. కానీ తాజాగా మంచు విష్ణు మనోజ్ కు సన్నిహితుడైన సారధి ఇంటికి వెళ్లి గొడవ పడడంతో ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video Advertisement
కొన్ని రోజులగా మంచు విష్ణు, మనోజ్ ల మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎక్కువగా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన మనోజ్, మౌనీకల వివాహానికి కూడా విష్ణు అతిథిలా వచ్చి, కాసేపటికే వెళ్లిపోయారు. ఆ సమయంలోనే అందరు అశ్చర్యపోయారు. తాజాగా అన్న విష్ణు ఇంటికొచ్చి గొడవ చేశారని, బంధువులను కూడా కొడుతున్నాడని మనోజ్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో వీరి మధ్య గొడవ బయటకు వచ్చింది.
మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు విష్ణును ఇద్దరు మనుషులు ఆపుతున్నారు. విష్ణు కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. కానీ ఆ తరవాత ఎందుకో డిలీట్ చేశాడు. అయితే గతంలోనే వీరి మధ్య గొడవలు ఉండేవని, మనోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడం వల్ల విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి. పిల్లలు చిన్న వయసులోనే విద్యాదేవి మరణించడంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని రెండవ పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి కుమారుడే మనోజ్. ఇక మనోజ్ కు మంచు లక్ష్మీతో పాటు విష్ణుతో కూడా విభేదాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే మనోజ్ పెళ్లిని అక్క లక్ష్మీనే దగ్గరుండి మరి తల్లిలా జరిపించారు.
Also Read: “హమ్మయ్య… మొత్తానికి సినిమా స్టార్ట్ అయ్యింది..!” అంటూ… కొరటాల శివ “NTR 30” సినిమా లాంచ్‌పై 15 మీమ్స్..!
This is what #ManchuManoj posted on his #Facebook story
Differences between brothers#VishnuManchu#ManchuFamily#Mohanbabu#LakshmiManchu pic.twitter.com/xDUIJivsiR
— ❤️HONESTU❤️ (@honestuuuu) March 24, 2023