యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ను సంపాదించుకున్నారు. తారక్ నటించబోయే సినిమాల పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూసిన NTR30 సినిమా మొదలైంది.

Video Advertisement

మాస్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న NTR30 మూవీ పూజా కార్యక్రమం ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమనికి ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ హాజరు అయ్యారు.  ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో తారక్ జాన్వీ కపూర్ ను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఆమె వద్దకు వెళ్ళి పలకరించాడు. జాన్వీని చూడగానే తారక్ షాక్ అవడం కెమెరాలో రికార్డ్ అయ్యింది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ntr-30-launch1ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. పూజ తరువాత ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మూవీ యూనిట్ కి స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం తారక్, జాన్వీ పై షూట్ చేసిన ముహూర్తపు షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కొరటాల మాట్లాడుతూ ఈ చిత్ర నేపద్యం తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రం తరువాత నా సోదరుడు మరియు ఈ తరంలోని గొప్ప యాక్టర్స్ లో ఒకరైన తారక్ తో కలిసి పని చేయడం అదృష్టం అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇలా లాంచ్ అయ్యిందో లేదో మీమర్స్ తమదైన శైలిలో ఈ NTR30 మూవీ పూజా కార్యక్రమం పైన మీమ్స్ వదిలారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే..

1.2.3. 4.5. 6.7. 8.

9.10.11.12.13.14.15.16.17.Also Read: “ఏదో షాపింగ్ మాల్ యాడ్ లాగా ఉంది ఏంటి..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” కొత్త పోస్టర్‌పై 15 ట్రోల్స్..!