Ads
నేటి కాలం ప్రేమలు నీటి మీద బుడగల లాగా పేలిపోతున్నాయి.. నిండు నూరేళ్లు బ్రతకాల్సిన జీవితాలు మధ్యలోనే తనువులు చాలిస్తున్నారు. ప్రేమికుల మధ్య మనస్పర్ధల వలనో, ఇంట్లో తల్లి దండ్రులు పెళ్లి ఒప్పుకోకపోవడం వలనో..మతాలు,కులాలు వలనో కావచ్చు ప్రాణాలు తీసుకునేంత వరకు వస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటక లోని మధ్య జిల్లా లో జరిగింది. వివరాల లోకి వెళ్తే..
Video Advertisement
ఆ యువకుడు మండ్య జిల్లాకి రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు. అతని పేరు గిరీష్.తను ప్రేమించిన యువతి పేరు నిత్యశ్రీ ఇద్దరు మూడు సంవత్సరాలు గా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇంట్లో నో చెప్పడంతో పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు..కానీ వీళ్ళని చూసిన నిత్యశ్రీ బంధువు ఒకరు నేను మీ ఇంట్లో మాట్లాడి మీ పెళ్ళికి ఒప్పిస్తా నంటూ నమ్మపలికి వారి ఇంటికి పంపించేశారు..ఇంతలో ఏమైందో ఏమో కానీ నిత్యశ్రీ ని వేరేఒకరితో పెళ్ళికి ఒప్పించారు ఇంట్లో పెద్దలు.
ఇది తెలుసుకున్న గిరీష్ ఒక్కసారి కోపంతో రగిలిపోయాడు. తన ప్రేయసిని మరొకరితో ఊహించలేననుకున్నాడో ఏమో…నిత్య శ్రీ ఇంటి బయట పహారా కాచి….తాను బయటికి వచ్చే వరకు ఆగి బయటకు రాగానే నిత్య ని కత్తితో పొడిచాడు..గిరీష్ విషం తాగాడు …
ప్రస్తుతం నిత్య బలమైన గాయాలతో చావుబ్రతుల మధ్య పోరాడుతుండగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నేటి కాలం యువత ప్రేమించిన యువతీ,యువకుడిని వదిలి ఉండలేక ఇంట్లో చెప్పిన మాటలు పాటించలేక ఆత్మహత్యలకు,హత్యలకు పాల్పడుతున్నారు . ప్రేమ కంటే జీవితం గొప్పది అని తెలుసుకోండి. ప్రేమలో విఫలమైనంత మాత్రాన మన ప్రాణాలు తీసుకోవడంలో లేక మనం ప్రేమించిన వారి ప్రాణాలు తియ్యడం క్షమించరాని నేరం.
source: etv
End of Article