Ads
ఇటీవల మంచు కుటుంబంలో జరిగిన గొడవలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. అన్నదమ్ముల మధ్య మొదలైన వివాదం నెట్టింట్లో ట్రెండ్ అయ్యేంతగా రచ్చకెక్కాయి. మనోజ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడ్డాయి.
Video Advertisement
గత కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వస్తుండగా, మనోజ్ పెట్టిన వీడియోతో విభేదాలు ఉన్నాయని చెప్పినట్టు అయ్యింది. ఈ వీడియో వైరల్ గా మారింది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు బయటికి రావడంతో ఈ టాపిక్ పై చర్చలు మొదలు అయ్యాయి. అయితే ఈ గోడవలకు కారణం ఆస్తుల పంపకాలు అనే టాక్ వచ్చింది. ఈ క్రమంలో మంచు కుటుంబానికి సన్నిహితుడు అయిన ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఈ గొడవ గురించి విస్మయపోయే విషయాలను చెప్పుకొచ్చారు.
అన్నదమ్ముల మధ్య గోడవకు కారణమైన సారధి ఎవరో కాదు మంచు ఫ్యామిలికి చాలా దగ్గరివాడని తెలిపారు. అంతే కాకుండా మోహన్ బాబు పర్సనల్ పనులన్ని చూసేది ఆ సారధే అని అన్నారు. మోహన్ బాబు ఎప్పుడో ఆస్తులన్నిటిని పంచి ఇచ్చారని, ఇక మంచు విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను తీసుకున్నారని, కానీ ఒక విషయంలో క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారు.
దాని కోసమే విష్ణుకి సారధితో చిన్నపాటి గొడవ అయ్యిందని చిట్టిబాబు తెలిపారు. సారధి క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకుని తిరిగేసరికి, విష్ణు ఆ విషయం గురించే సారధి ఇంటికి వెళ్లాడని అన్నారు. సారధి ఇంటి దగ్గర గొడవ అయ్యిందని, అయితే ఆ టైమ్ లో మోహన్ బాబుకి కాల్ చేస్తే గొడవ అయ్యేది కాదని అన్నారు. సారధి ఇంటికి వెళ్లి మంచు విష్ణు గొడవ చేయడం తప్పు. ఇక ఈ విషయన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడం మంచు మనోజ్ తప్పని చిట్టిబాబు తెలిపారు. మోహన్ బాబు ఏ సమస్య అయిన బయటికి రాకుండా నాలుగు గోడల మధ్యనే సరి చేసేవాడు. ఇప్పుడు కొడుకులు ఇద్దరు దాన్ని క్రాస్ చేసి, మంచు ఫ్యామిలిని విమర్శించే వాళ్లకి ఛాన్స్ ఇచ్చారని అన్నారు. Also Read: ఆ దర్శకుడి వల్లే నా జీవితం నాశనం అయ్యింది.. నటి జయలలిత కామెంట్స్ వైరల్..!
End of Article