ఆ దర్శకుడి వల్లే నా జీవితం నాశనం అయ్యింది.. నటి జయలలిత కామెంట్స్ వైరల్..!

ఆ దర్శకుడి వల్లే నా జీవితం నాశనం అయ్యింది.. నటి జయలలిత కామెంట్స్ వైరల్..!

by kavitha

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి అందాల నటి అయిన జయలలిత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అప్పటి ఆడియెన్స్ అలరించింది. జయలలిత ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ లో కూడా రాణిస్తోంది.

Video Advertisement

ఇక జయలలిత సినీ కెరీర్ సజావుగా కొనసగినప్పటికి, ఆమె వ్యక్తిగత జీవితం ముళ్లబాట అని చెప్పవచ్చు. అందులోనూ వివాహ జీవితంలో ఆమె చాలా వేధింపులకు లోనయ్యింది. అయితే ఏనాడూ కూడా ఈ విషయాన్నీ జయలలిత మీడియాకి చెప్పలేదు. కానీ తొలిసారి ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కమల్ హాసన్ నటించిన ‘ఇంద్రుడు చంద్రుడు’ అనే చిత్రంతో జయలలిత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అప్పట్లో సహాయక పాత్రలలో, నెగెటివ్ పాత్రలలో ఆమె నటన అద్భుతంగా అని చెప్పవచ్చు. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే మలయాళ దర్శకుడు వినోద్ ను ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో వాళ్ళను ఎదురించి దర్శకుడు వినోద్ ను వివాహం చేసుకుంది. వినోద్ తో తాను 25 చిత్రాలు చేశానని, ఒకసారి జరిగిన గొడవలో ఆయన తనను సేవ్ చేయడంతో అతనికి దగ్గర అయ్యానని తెలిపింది.
jayalaitha-1అలా 7 సంవత్సరాలు ప్రేమించుకున్నామని, హఠాత్తుగా పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేశాడు. అతని ప్రవర్తన మా ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చలేదు. దాంతో అతనితో పెళ్లి వద్దని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్పారు. కానీ ప్రేమ గుడ్డిది. రక్తంతో  ప్రేమలేఖలు వ్రాసాడు, విషం తాగుతా అని బెదిరించి, పెళ్లికి ఒప్పించాడు. కానీ మా ఇంట్లోవాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో వాళ్ళను ఎదురించి డైరెక్టర్ వినోద్ ని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నేను సంపాదించిన ఆస్తిని నా పేరెంట్స్ పేరు మీద రాయించుకున్నారు. ఎందుకంటే వినోద్ మీద నమ్మకం లేకపోవడంతో అలా చేశారు.
jayalaitha-2అయితే పిల్లలు పుట్టిన తరువాత ఇస్తామని చెప్పారు. ఆరోజు వాళ్ళు అలా చేయడం నాకు ఉపయోగపడింది. పెళ్లి అయ్యాక ఇద్దరం 6 మాసాలు కూడా కలిసి లేము. అతను ఆస్తి కోసమే నన్ను వివాహం చేసుకున్నాడని తెలిసింది. నా ఆస్థి కోసం ఎంతగానో వేధించాడు. యాసిడ్ పోస్తానని వేధించేవాడు. అలా మేము సంవత్సరం గడవక ముందే విడిపోయాం. అప్పటి నుండి ప్రేమ కోసం చస్తాం అనేవారిని చూస్తే చిరాకు, కోపం వస్తుంటుంది. ఎందుకంటే ఆ ప్రేమే నా లైఫ్ ని నాశనం చేసిందని జయలలిత వెల్లడించింది. ఆమె చేసిన ఈ  కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.jayalaitha-3Also Read: “ఏదో ఫ్యామిలీ సినిమా అనుకున్నాం కానీ యాక్షన్ సినిమాలాగా ఉంది ఏంటి..?” అంటూ… “మహేష్ బాబు-త్రివిక్రమ్” సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like