ఆ స్టార్ హీరో మోసగాడు అంటూ.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!

ఆ స్టార్ హీరో మోసగాడు అంటూ.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!

by kavitha

Ads

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులలో అజిత్ కుమార్ కూడా ఒకరు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను ఇచ్చిన  బాక్సాఫీస్ కింగ్ అయినా, ఇండస్ట్రీలో అజిత్ చాలా వినయంగా మెలుగుతూ, డౌన్ టు ఎర్త్‌గా పేరు తెచ్చుకున్నాడు. సింపుల్ గా ఉంటూ, తన చిత్రాలను పూర్తి చేసుకుంటూ, అభిమానులకు అందుబాటులో ఉండే హీరో అజిత్ అని అందరికి తెలిసిందే.

Video Advertisement

ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ అజిత్ కుమార్ పై అతనో మోసగాడని సంచలన కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ajith-kumarప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ మాట్లాడుతూ, హీరో అజిత్ తన వద్ద 25 సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నాడని, వాటిని ఇంత వరకు ఇవ్వలేదంటూ అజిత్ పై తీవ్రమైన విమర్శలు చేశాడు. తన పేరెంట్స్ ను మలేషియా పంపించడం కోసం అజిత్ తన దగ్గర డబ్బు తీసుకున్నాడు. అప్పుడు తన ప్రోడక్షన్ లో ఒక మూవీ చేసి రెమ్యూనరేషన్ లో ఈ డబ్బుని సర్దుబాటు చేస్తానని చెప్పాడు.
అయితే ఆ రోజు నుండి ఇంత వరకు తన బ్యానర్ లో అజిత్ ఒక్క సినిమా కూడా చేయలేదని మాణిక్యం తెలిపాడు. అజిత్ తనను పెద్ద మనిషి అని అనుకుంటాడు. కానీ అతను ఒక మోసగాడని అన్నారు. ఇన్నేళ్ల నుండి అజిత్ తో ఈ డబ్బు గురించి మాట్లాడుతూన్నా కూడా ఆయన సైడ్ నుండి ఎలాంటి స్పందన రావట్లేదని నిర్మాత మాణిక్యం వెల్లడించాడు.
ప్రస్తుతం అజిత్ ఒక్కో సినిమాకు 50 కోట్ల పైనే పారితోషికం తీసుకుంటున్నాడని, తనకు రావలసిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు అంటూ మాణిక్యం అజిత్ పై మండిపడుతున్నారు. ఈ విషయం గురించి మాణిక్యం గతంలో కూడా మీడియా ముందు మాట్లాడాడు. అయితే అప్పుడు, ఇప్పుడు అజిత్ వైపు నుండి కానీ, ఆయన సన్నిహితుల నుండి కానీ ఎటువంటి క్లారిటీ అయితే రావడం లేదు.

Also Read: బిగ్‌బాస్ తెలుగు-7 ప్రోమో విడుదల..! ఈసారి ఊచకోతే అంటున్న ఫ్యాన్స్..!


End of Article

You may also like