Megastar: ఆ నిర్మాత చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టారట.. ఎవరో తెలుసా..?

Megastar: ఆ నిర్మాత చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టారట.. ఎవరో తెలుసా..?

by Anudeep

మెగాస్టార్ చిరంజీవికి ఈ స్టార్ డమ్ ఊరికే రాలేదు. ఆయన కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నిటిని దాటుకుని ఆయన ఈ స్థాయికి వచ్చారు.

Video Advertisement

ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటూ.. పగలు రాత్రి ఎడతెరపి లేకుండా కష్టపడ్డారు. అయితే.. ఆ సమయంలో ఆయనకీ చాలా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. వాటిలో ఒకదాని గురించి చెప్పుకుందాం.

megastar

మెగాస్టార్ ఓ సినిమాలో విలన్ గా కూడా నటించారు. ఈ సమయంలోనే నిర్మాత ఆయన్ని ఓ రోజంతా ఎండలో నిలబెట్టారట. ఈ విషయాన్ని సీనియర్ నటి తులసి చెప్పుకొచ్చారు. తేజ సజ్జ నటించిన అద్భుతం సినిమాలో నటించిన తులసి.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “కోత‌ల రాయుడు ” సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో చిరు ఓ రోజు షూటింగ్ కి ఆలస్యంగా వస్తే.. నిర్మాత భరద్వాజ్ కోప్పడ్డారని.. ఆయనను రోజంతా ఎండలో నే నిలబడమని చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే చిరు మాత్రం కోపం తెచ్చుకోకుండా శిక్షను పూర్తి చేశారట.


You may also like