“అంటే అది..!” అంటూ… “బాహుబలి ప్రొడ్యూసర్” ఇచ్చిన కౌంటర్ కి రాజమౌళి రిప్లై..! ఏం అన్నారంటే..?

“అంటే అది..!” అంటూ… “బాహుబలి ప్రొడ్యూసర్” ఇచ్చిన కౌంటర్ కి రాజమౌళి రిప్లై..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. టాప్ ఇండియన్ దర్శకులలో ఒకరైన జక్కన్న తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2989 AD’ మూవీ గురించి ట్వీట్ చేశారు.

Video Advertisement

రాజమౌళి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రాజమౌళి చేసిన ఈ ట్వీట్ పై ఆయన సన్నిహితులు మరియు ఫాలోవర్స్, నెటిజెన్లు కౌంట‌ర్లు వేస్తున్నారు. వారిలో బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌ పెట్టిన ట్వీట్‌ కి రాజమౌళి స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..rajamouli-on-kalikiప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2989 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ హాలీవుడ్ మూవీలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో, ‘గ్రేట్ జాబ్ నాగి మరియు వైజయంతి మూవీస్. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాని తెరకెక్కించడం చాలా కష్టమైన పని, మీరు దీన్ని సాధ్యం చేసారు. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఇక మిగిలింది ఒక్క ప్రశ్న మాత్రమే, మూవీ రిలీజ్ ఎప్పుడు’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై జక్కన్న సన్నిహితులు, ఫాలోవర్స్, నెటిజెన్లు కౌంట‌ర్లు వేస్తున్నారు. బాహుబ‌లి మూవీ నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌ ‘రిలీజ్ డేట్ గురించి అడుగుతోంది ఎవరో చూశారా అని సరదాగా ట్వీట్  పెట్టారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ స్మైల్ ఎమోజీలు పెట్టాడు.రాజమౌళి శోభు యార్ల‌గ‌డ్డ‌ ట్వీట్ కి ‘అంటే అది’ అని పాపులర్ అయిన లక్ష్మి సినిమాలోని బ్రహ్మానందం మీమ్ తో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ రాజమౌళిని ఉద్దేశించి ‘మీరు చాలా స్వీట్. చాలా హంబుల్. మీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ట్వీట్ చేశారు.

Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్-K” అలియాస్ “కల్కి 2898 AD” గ్లింప్స్ లో… ఒకే ఒక్క సీన్‌లో కనిపించిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?

 


End of Article

You may also like