“ప్రభాస్” తో పాటు… “ప్రాజెక్ట్-K” సినిమాలో నటిస్తున్న ఈ 5 నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

“ప్రభాస్” తో పాటు… “ప్రాజెక్ట్-K” సినిమాలో నటిస్తున్న ఈ 5 నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఆ తరువాత లైన్ లో సలార్, ప్రాజెక్ట్ కే ఉన్నాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పాన్‌ వరల్డ్‌ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రభాస్ కు హీరోయిన్ గా దీపికా పదుకొణె నటిస్తోంది.

Video Advertisement

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీలో నటిస్తున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో నటిస్తున్న నటీనటుల రెమ్యునరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. Project-K-Remuneration-detailsతెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకు చిత్రీకరణ పూర్టి చేసుకుందని సమాచారం. ఈ సినిమా పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించేవారి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్టర్ల పారితోషికమే రూ. 200 కోట్లు అని తెలుస్తోంది.
1. ప్రభాస్:

ప్రాజెక్ట్ కేలో హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
2. దీపికా పదుకొణె:

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాకి రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 3. అమితాబ్‌ బచ్చన్:

అమితాబ్‌ బచ్చన్ ఈ మూవీలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. దీనికి గాను రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
4. కమల్ హాసన్:

కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించడం కోసం 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 5. దిశా పటానీ:
ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read: “ఈ విషయం ఇప్పుడు అర్ధం అయ్యింది..!” అంటూ… “ఆదిపురుష్” పై సెహ్వాగ్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like